Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ పోరుబాట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కాం గ్రెస్ సర్కార్‌పై బిఆర్‌ఎస్ పోరు బావుటా ఎగరేసింది. ఇచ్చిన హామీలు అమ లు చేయకుండా మోసగిస్తోందంటూ నిరసన బాట పట్టింది. రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు బోనస్ విషయంలో అన్నదాతలను ప్రభు త్వం మోసగిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తం గా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతు లు, గులాబీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో స్వచ్ఛం దంగా పాలుపంచుకున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై ధర్నా చేపట్టా రు. వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళ న ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వరంగల్, మహబూబాబాద్, జగిత్యా ల, ఆసిఫాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో రైతన్నలు, బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలపై నినదిస్తూ తమ నిరసనలను వ్యక్తపర్చారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గులాబీ శ్రేణులు రోడ్డెక్కాయి.

మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ర్యాలీ అనంతరం రోడ్డుపై వడ్లను పోసి నిరసన తెలిపారు. సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామంటోందంటూ ఆసిఫాబాద్‌లో నల్ల జెండాలు ప్రదర్శించారు. నిర్మల్ జిల్లాలో గులాబీ శ్రేణుల రాస్తారోకో వల్ల రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిజామాబాద్, బాల్కొండలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయం ముందు బిఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదంటూ నర్సాపూర్‌లో ఎంఎల్‌ఎ సునీత రెడ్డి, గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఐకెపి కేంద్రం వద్ద మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసన తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలంటూ మంథని, మెట్‌పల్లిలో కార్యకర్తలు ధర్నా చేశారు. రైతులకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కిందని హుస్నాబాద్‌లో వొడితెల సతీశ్ కుమార్, గోదావరిఖనిలో కోరుకంటి చందర్ ఆరోపించారు.

పెద్దపల్లిలో మాజీ ఎంఎల్‌ఎ దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. కరీంనగర్‌లో రైతులకు మద్దతుగా నిరసన చేపట్టిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ’ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ వచ్చిందో, అప్పటి నుంచి రైతులకు వ్యతిరేకంగానే ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. రుణమాఫీ ఇప్పుటివరకు రాలేదు. రైతుల భరోసా వచ్చే పరిస్థితిలో లేదు. వరికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు ఎట్టిపరిస్థితిలో ప్రభుత్వం మాట మార్చిన కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే మేం ధర్నా చేస్తున్నాం’- మని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో కర్షకులు, గులాబీ శ్రేణులు మహేశ్వరం గేటు శ్రీశైలం రహదారిపై నిరసనలకు దిగారు. అదేవిధంగా శామీర్‌పేటలోని వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులు, మేడ్చల్ నియోజకర్గ నాయకులతో కలిసి ఎంఎల్‌ఎ మల్లారెడ్డి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News