ప్రొ. జాన్ కురియన్‌కు అమెరికాలో ఉన్నత పదవి
వాండెర్‌బిల్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డీన్‌గా నియామకం
హూస్టన్: అమెరికలోని ప్రఖ్యాత కళాశాలలకు సారథ్యం వహిస్తున్న భారతీయ-అమెరికన్ పౌరుల సంఖ్య పెరుగుతోంది. జన్మతః భారతీయుడైన ప్రముఖ స్ట్రక్చరల్ బయాలజిస్ట్ జాన్ కురియన్ వాండెర్‌బిల్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బేసిక్ సైన్సెస్ తదుపరి డీన్‌గా నియమితులయ్యారు. టెన్నెస్సీలో ఉన్న వాండెర్‌బిల్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బేసిక్ సైనెస్ డీన్‌గా 2023 జనవరి 1వ తేదీన కురియన్ బాధ్యతలు చేపడతారు. మాలిక్యులర్, సెల్ బయాలజీ ప్రొఫెసర్‌గా పేరుపొందిన కురియన్ బెర్కెలీలోని యూనివర్సిటీ కాలిఫోర్నియాలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా, హోవార్డ్ హుగెస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఇన్వెస్టిగేటర్‌గా 30 ఏళ్లకు పైబడి పనిచేశారు. పెన్సిల్వేనియాలోని హంటింగ్‌డన్‌లో ఉన్న జునియాటా కాలేజ్‌కు బదిలీ కావడానికి ముందు రెండేళ్లపాటు యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో కురియన్ చదువుకున్నారు.
John Kurien appointed as Dean of Vanderbilt School