Friday, November 22, 2024

హాంగ్‌కాంగ్ నేతగా జాన్ లీ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

John Lee elected leader of Hong Kong

చైనా రోబోగా పేరొందిన భద్రతాధికారి

హాంగ్‌కాంగ్ : స్థానికంగా హాంగ్‌కాంగ్‌లో చైనా ఆధిపత్యానికి ఎటువంటి అడ్డంకి లేని స్థితి ఏర్పడింది. చైనా అనుకూల వ్యక్తిగా పేరొందిన జాన్ లీ హాంగ్‌కాంగ్ నగర అధికారిక నేతగా, ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఎన్నికయ్యారు. స్థానికంగా సాగిన ప్రజాస్వామిక వాదనల ఉద్యమాన్ని అణచివేయడంలో విజయం సాధించిన అతివాద భద్రతా అధికారిగా ఉన్న జాన్‌లీ ఇప్పటి ఎన్నికలలో హాంగ్‌కాంగ్ నేత అయ్యారు. ఎక్కువగా బీజింగ్ అనుకూల సభ్యులతో కూడిన కమిటీ ద్వారా ఎన్నిక జరిగింది. 1500 మంది కమిటీ సభ్యులు తదుపరి సిఇఒ ఎన్నికలో పాల్గొని ఓటేశారు. ఈ ప్రక్రియలో జాన్‌లీకి అత్యధికంగా దాదాపుగా 99 శాతం పైగా ఓట్లు వచ్చాయి. ప్రతి ఓటును బలాన్ని క్షుణ్ణంగా అన్ని దశలలోనూ బీజింగ్‌లోని ప్రభుత్వ ప్రతినిధులు పరిశీలించారు. జులై 1వ తేదీతో ఇప్పటి సిఇఒ కెర్రీ లామ్ పదవికాలం గడువు ముగుస్తుంది.

ఈ అధికారిణి హయాం అంతా కూడా ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు, స్థానికంగా వీధులలో ప్రదర్శనలు, శాంతియుత సభలతో సాగింది. దీనిని క్రమపద్ధతిలో చైనా తన వ్యూహాత్మక పద్ధతులతో అణచివేసింది. మహానగరంలో శాంతిభద్రతల పరిస్థితి, ఘర్షణలు , తరువాత కొవిడ్ వైరస్ తీవ్రస్థాయిలతో ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా విలసిల్లిన హాంగ్‌కాండ్ గౌరవం వెలుగులు సన్నగిల్లాయి. తన అధికారిక వారసుడికి లామ్ అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు తరువాతి క్రమం గురించి తాము బీజింగ్‌లోని అత్యున్నత స్థాయి అధికారులకు వివరణ ఇచ్చుకుంటామని అన్నారు. హాంగ్‌కాంగ్‌కు పూర్వపు కళను తీసుకువచ్చేందుకు , ఓ కొత్త అధ్యాయం నిర్మించేందుకు తాను పాటుపడుతానని ఈ సెక్యూరిటీ ఆఫీసర్ తమ విజయోత్సవ సభలో ప్రసంగిస్తూ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News