అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ బాషా బెయిల్ పిటీషన్‌ను రంగారెడ్డి జిల్లా, పోక్సో కోర్టు బెయిల్ పిటీషన్‌ను అక్టోబర్7వ తేదీ వరకు వాయిదా వేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు రావడంతో , పోక్సో కేసులో ఆయనను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జానీ బాషాను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. పలు కీలక అంశాలను రాబట్టినట్లు సమాచారం. పోలీసు కస్టడీలో జానీ మాస్టర్‌ను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆరోపణలు చేసిన యువతిలో ఎలాంటి సబంధం కలిగి ఉన్నారు. ఆమెతో ఎలా పరిచయం ఏర్పడిందనే దానిపై వివిధ కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది. బాధితురాలి నుంచి పోలీసులు సేకరించిన ఆధారాలను జానీ ముందు పెట్టి విచారించారు.
బాధితురాలికి ఒక ప్రముఖ డ్యాన్స్ షోలో పాల్గొనే అవకాశం రావడంతో 2017లో నగరానికి వచ్చిందని. తర్వాత జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరిందని పేర్కొన్నారు. 2019 డిసెంబరు 15 నుంచి జానీ మాస్టర్ వద్దే పనిచేస్తూ అల్కాపురికాలనీలో ఉంటోందని, ఆ సమయంలో ఇద్దరూ ఒక సూపర్‌హిట్ సినిమాకు పనిచేశారని ప్రస్తావించారు. ఆ సినిమా పని నిమిత్తం 2020 జనవరి 10న జానీ మాస్టర్, బాధితురాలు, మరో ఇద్దరు సహాయకులు ముంబైకి వెళ్లారన్నారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు బాధితురాలిని ఆధార్‌కార్డు, ఇతర డాక్యుమెంట్లు తీసుకొని తన గదికి రావాలని ఆదేశించారని, ఆమె గదిలోకి రాగానే గడియపెట్టి అత్యాచారం చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పటికీ బాలిక వయసు 16 సంవత్సరాలని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.