అతడికి 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని అంబర్ హెర్డ్‌కు ఆదేశం
ముంబై: హాలీవుడ్‌లో సంచలన నటీనటులు జానీ డెప్, అంబర్ హెర్డ్. జానీ డెప్ ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నటి అంబర్ హెర్డ్‌తో ప్రేమలో పడి 2015లో పెళ్ళి కూడా చేసుకున్నాడు. అయితే అనతి కాలంలోనే వారి మధ్య పొరపొచ్చలు వచ్చాయి. 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే 2018లో అంబర్ హెర్డ్ ‘వాషింగ్టన్ పోస్ట్’కు రాసిన ఓ బహిరంగ వ్యాసంలో తనకు కూడా గృహ హింస తప్పలేదని పేర్కొంది. అయితే జానీ డెప్ పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. కానీ వివాదంలో అతడి పేరు మారు మ్రోగిపోయింది. దాంతో అతడు కోర్టుకు ఎక్కాడు. ఆమె రాసిన ఆర్టికల్ కారణంగా తన కేరీర్ దెబ్బతిందని కోర్టుకు నివేదించాడు. అంతేకాక పరువు నష్టం కింద 50 మిలియన్ డాలర్ల దావా వేశాడు. అయితే అంబర్ హెర్డ్ కూడా ప్రతిగా అతడిపై 100 మిలియన్ డాలర్ల కౌంటర్ దావా వేసింది. జానీ న్యాయవాది చేసిన వ్యాఖ్యల కారణంగా తన పరువుకు భంగం కలిగిందని ఆరోపించింది. కోర్టు విచారణ సమయంలో హెర్డ్ అతడు తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని పేర్కొంది. గాయాల ఫోటోలను కూడా చూపింది. అయితే ఆ ఆరోపణలన్నింటినీ జానీ ఖండించాడు. తానెప్పుడు హింసాత్మకంగా వ్యవహరించలేదని పేర్కొన్నాడు. పైగా తనకు సినిమా అవకాశాలు రాకుండా చేసిందని వాదించాడు. దీనిపై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జానీ డెప్‌కు పరువు నష్టం కలిగించినందుకు 10 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు చెప్పింది. అలాగే డెప్ న్యాయవాది ఆరోపణల కారణంగా హెర్డ్‌కు పరువుకు భంగం కలిగినందుకు ఆమెకు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని కూడా ఆదేశించింది. హెర్డ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అన్యాయం జరిగిందంది. కాగా కోర్టు తీర్పును జానీ హర్షించాడు. ఆరేళ్ల కిందట తన జీవితం గందరగోళానికి గురయిందని, తన పిల్లల జీవితంపై, కెరీర్‌పై కూడా ప్రభావం పడిందని, నిజమేంటో ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే తాను కేసు వేసానని, తానేమిటో ఇప్పుడు అందరికీ తెలిసినందుకు మనశ్శాంతిగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశాడు.
NEW CHAPTER: Johnny Depp says he’s ‘at peace’ after winning defamation case against ex-wife Amber Heard. https://t.co/lBfWr9nLrW pic.twitter.com/KCwkbgkP5o
— Fox News (@FoxNews) June 1, 2022