Sunday, December 22, 2024

జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్..

- Advertisement -
- Advertisement -

చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.  ‘‘నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనల వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్నా. నిజం అనేది ఏదో ఓ రోజు తప్పక బయటపడుతుంది. నా ఫ్యామిలీ పడిన కష్టం.. ఎప్పటికీ నన్ను వేదనకు గురిచేస్తూనే ఉంటుంది. 37 రోజుల్లో మేం ఎంతో మిస్‌ అయ్యామంటూ జానీ మాస్టర్‌ తన ఫ్యామిలీని ఉద్దేశిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

కాగా, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అసిస్టెంట్ లేడి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ కు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దు అయ్యింది. రెండు రోజుల క్రితం జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News