Monday, December 23, 2024

హైదరాబాద్‌లో ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ను ప్రారంభించిన జాన్సన్‌ కంట్రోల్స్‌ ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: స్మార్ట్‌, హెల్తీ, సస్టెయినబల్‌ బిల్డింగ్స్‌ కోసం అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న జాన్సన్‌ కంట్రోల్స్‌ నేడు అధికారికంగా తమ నూతన, అత్యాధునిక, ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌, ఎక్స్‌లెన్స్‌ కోసం తెరిచినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లోని జాన్సన్‌ కంట్రోల్స్‌, ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖామాత్యులు కె.టి.రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాన్సన్‌ కంట్రోల్స్‌ గ్లోబల్‌ సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ జనరల్‌ మేనేజర్‌ డేవ్‌ పుల్లింగ్‌ ; జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ గ్లోబల్‌ వీపీ గోపాల్‌ పారిపల్లి; జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇంట్రూజన్‌ ప్రొడక్ట్స్‌ గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, తజ్మిన్‌ పిరానీ పాల్గొన్నారు.

‘‘హైదరాబాద్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం ఏర్పాటుచేయడమన్నది భద్రతను నిర్మించడం కోసం సస్టెయినబల్‌ సాంకేతికతలో అత్యంత కీలకమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, భారతదేశంలో టెక్‌ ఇన్నోవేషన్‌, ప్రతిభావంతుల కేంద్రంగా నిలువాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు అత్యంత కీలకమైనది’’ అని కె.టి. రామారావు అన్నారు.

ఆయన మాట్లాడుతూ ‘‘జాన్సన్‌ కంట్రోల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం, ఈ కేంద్రం ఏర్పాటులో మా వంతు పాత్ర పట్ల మేము గర్వంగా ఉన్నాము’’ అని అన్నారు. ఈ కేంద్రం, 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ వద్దనున్న గౌర ఫౌంటెన్‌హెడ్‌ వద్ద ఉంది. ఇది భారతదేశంలో ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్ల (పూనె, గుర్‌గావ్‌, బెంగళూరు, ఢిల్లీ) నెట్‌వర్క్‌తో చేరుతుంది. దానితో పాటుగా భారతదేశంలో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఉనికిని సైతం విస్తరిస్తుంది. ఈ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం ప్రధానంగా సెక్యూరిటీ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇంటిలిజెంట్‌ ఎడ్జ్‌ ఉపకరణాలు వినియోగించి వినియోగదారుల అనుభవాలను సమూలంగా మార్చేందుకు ఇది అంకితమై ఉంది.

‘‘ఐఓటీ, ఏఐ మరియు 5జీ రూపంలో నూతన 5వ వేవ్‌ టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పనితీరును ఉన్నతంగా మెరుగుపరుస్తూనే డీకార్బనైజేషన్‌, సస్టెయినబిలిటీ, ఇంధన సామర్ధ్యం, పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను అందించే రీతిలో భవంతులు పునరావిష్కరింప చేయబడుతున్నాయి’’అని జాన్సన్‌ కంట్రోల్స్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, విజయ్‌ శంకరన్‌ అన్నారు.ఆయనే మాట్లాడుతూ ‘‘ఈ నూతన సెంటర్‌, బిల్డింగ్‌ టెక్నాలజీలో మా నూతన ఆవిష్కరణలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాన్సన్‌ కంట్రోల్స్‌ యొక్క ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాల నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఉంటుంది’’ అని అన్నారు.

ఈ నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ కోసం ఎసెంచర్‌తో జాన్సన్‌ కంట్రోల్స్‌ భాగస్వామ్యం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఎసెంచర్‌ అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది. వారి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ బృందాలు నేరుగా జాన్సన్‌ కంట్రోల్స్‌ అత్యున్నత శ్రేణి సాంకేతికతను ఉపయోగించేందుకు తోడ్పడతాయి. ఈ సాంకేతికతలలో 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), మెటావర్శ్‌ ప్లాట్‌ఫామ్స్‌ మరియు డిజిటల్‌ ట్విన్స్‌ వంటివి ఉంటాయి. ఈ సాంకేతికతలు, జాన్సన్‌ కంట్రోల్స్‌ ఓపెన్‌ బ్లూ ప్లాట్‌ఫామ్‌– కంపెనీ యొక్క ఏఐ ఆధారిత బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌కు అనుగుణంగా పనిచేస్తాయి. ఓపెన్‌ బ్లూ అనేది క్లౌడ్‌ ఆధారితంగా కనెక్ట్‌ చేయబడిన సొల్యూషన్స్‌ మరియు సేవల సూట్‌. ఇది వినియోగదారుల ప్రస్తుత ఐటీ మరియు కార్యాచరణ సాంకేతికతతో కలిసిపోతుంది. ఆర్కిటెక్ట్స్‌, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో కూడిన బృందాలు విప్లవాత్మక ఓపెన్‌ బ్లూ సాంకేతికతలు అయినటువంటి కృత్రిమ మేథస్సు, మెషీన్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, బయోమెట్రిక్స్‌ ను వినియోగించడం సహా మరెన్నో అంశాల ద్వారా మార్కెట్‌ ఆధారిత భద్రతా ఉత్పత్తులు అయినటువంటి ఇంట్రూషన్‌, యాక్సెస్‌ కంట్రోల్‌ మరియు వీడియో నిఘా (ఏసీవీఎస్‌) ఉత్పత్తులు రూపొందిస్తున్నారు.

ఈ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం 500 మంది ఇంజినీర్లతో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో అదనంగా మరిన్ని ఉద్యోగాలను బహుళ అంశాలైనటువంటి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఎడ్జ్‌ ఇంజినీర్స్‌, ఏఐ/కంప్యూటర్‌ విజన్‌ సైంటిస్ట్‌లు మరియు ఇంజినీర్స్‌, డాటా సైంటిస్ట్స్‌ మరియు ఎనలిస్ట్స్‌ మరియు యుఐ/యుక్స్‌ స్పెషలిస్ట్స్‌గా నియమించనుంది. ఐటీ మరియు ఇంజినీరింగ్‌ ప్రతిభావంతుల కోసం భారతదేశం యొక్క అతిపెద్ద గమ్యస్థానాలలో ఈ నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ తో పాటు జాన్సన్‌ కంట్రోల్స్‌ తన భద్రతా ఉత్పత్తులను నడపడానికి భారతదేశాన్ని వ్యూహాత్మక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘భారతదేశంలోని హైదరాబాద్‌లో మా నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం మరింతగా జాన్సన్‌కంట్రోల్స్‌ యొక్క సమగ్ర భవనాల భద్రతా పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడం’’ అని డేవ్‌ పుల్లింగ్‌, అధ్యక్షుడు, జనరల్‌ మేనేజర్‌ గ్లోబల్‌ సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌, జాన్సన్‌ కంట్రోల్స్‌ అన్నారు. ‘‘ఈ నూతన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రం భారతదేశం నుంచి భారతదేశానికి స్మార్ట్‌, హెల్తీ, సస్టెయినబల్‌ బిల్డింగ్స్‌ కోసం అత్యున్నత శ్రేణి పరిష్కారాలను అందించాలనే జాన్సన్‌ కంట్రోల్స్‌ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది’’అని అన్నారు. భారతదేశంలో జాన్సన్‌కంట్రోల్స్‌ గత 27 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నేడు జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇండియాలో 6వేల మంది ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ సంఖ్యను మరింతగా విస్తరించనుంది.

జాన్సన్‌ కంట్రోల్స్‌ గురించి :

జాన్సన్‌ కంట్రోల్స్‌ (ఎన్‌వైఎస్‌ఈ ః జెసీఐ) వద్ద, మేము ప్రజలు నివశించే, పనిచేసే, అభ్యసించే మరియు ఆటలాడే ప్రాంతాలలో వాతావరణం మార్చాలనుకుంటున్నాము. స్మార్ట్‌, హెల్తీ, సస్టెయినబల్‌ బిల్డింగ్స్‌లో అంతర్జాతీయంగా అగ్రగామిగా, ప్రజలు, ప్రాంగణాలు, ప్లానెట్‌కు సేవలనందించేందుకు భవంతుల పనితీరును పునర్నిర్వచించాలనుకుంటున్నాము.

దాదాపు 135 సంవత్సరాల కంటే ఎక్కువ ఆవిష్కరణల గర్వించతగిన చరిత్ర ఆధారంగా మేము మా సమగ్ర డిజిటల్‌ ఆఫర్‌ అయిన ఓపెన్‌ బ్లూ ద్వారా ఆరోగ్య సంరక్షణ, పాఠశాలలు, డాటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, స్టేడియంలు, తయారీ మరియు అంతకు మించిన పరిశ్రమల కోసం భవిష్యత్‌ యొక్క బ్లూ ప్రింట్‌ను అందజేస్తాము. నేడు, 150కు పైగా దేశాలలో ఒక లక్షకు పైగా నిపుణులతో కూడిన అంతర్జాతీయ బృందంతో జాన్సన్‌ కంట్రోల్స్‌ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ పోర్ట్‌ఫోలియో తో పాటుగా సర్వీస్‌ సొల్యూషన్స్‌ పోర్ట్‌ఫోలియోను పరిశ్రమలో అత్యంత నమ్మకమైన పేర్ల నుంచి అందిస్తుంది. మరింత సమాచారం కోసం johnsoncontrols.com చూడండి మరియు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై @Johnson Controls చూడండి.

జాన్సన్‌ కంట్రోల్స్‌ ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాల గురించి :

జాన్సన్‌ కంట్రోల్స్‌ను ఆవిష్కరణలపై రూపొందించారు. ఆవిష్కరణ అనేది సంస్థ డీఎన్‌ఏలో అంతర్భాగం. నేడు, మా ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ కేంద్రాలు ఈ మహోన్నత చరిత్రపై మరో అద్యాయం రాయడంతో పాటుగా నిష్ణాతులైన బృందాల నడుమ సౌకర్యవంతమైన భాగస్వామ్యానికి మద్దతునందిస్తూ స్మార్ట్‌, హెల్తీ, సస్టెయినబల్‌ స్పేసెస్‌ అందించేందుకు నూతన మార్గాలను కనుగొంటున్నాయి. భవిష్యత్‌ యొక్క బ్లూప్రింట్‌కు తగిన శక్తినీ అందిస్తున్నాయి.

www.johnsoncontrols.com/openblue/openblue-innovation-centers

Johnson Controls starts Openblue Innovation Center in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News