Friday, December 20, 2024

అసలు వయస్సు 45 ఏళ్లైనా.. 18 ఏళ్ల యువకుడిలా మారడానికి తాపత్రయం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : వయస్సు పెరుగుతుంటే స్వరూపంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. నడివయసు వచ్చిన తరువాత యవ్వనం నాటి రూపు రేఖలు మాసిపోతుంటాయి. అయితే వృద్ధాప్యం ఏమాత్రం కనిపించకుండా నిత్యం ఆరోగ్యంగా కనిపించాలన్న ఆకాంక్షతో కొందరు వ్యాయమాలు, మార్నింగ్ వాక్ వంటివి చేస్తుంటారు. మరికొందరు కొన్ని సౌందర్య లేపనాలు వాడుతుంటారు. ఈ మార్గాల్లో కాకుండా విరుద్దమైన మార్గాలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు మరికొందరు. రివర్స్ ఏజింగ్ అంటే వయస్సును వెనక్కి తీసుకెళ్లడం. అసలు ఇది సాధ్యమేనా ? అన్నది ప్రశ్న. అయితే వైద్యసాంకేతిక విధానాల ద్వారా సుసాధ్యం చేయవచ్చనే ప్రయోగాలు గత కొన్నేళ్లుగా సాగుతున్నాయి. అలాంటి ప్రక్రియతో వార్తల్లోకి ఎక్కిన సాఫ్ట్‌వేర్ మిలియనేర్ ప్రయత్నం గురించి బ్లూమ్‌బర్గ్ కథనం ఆధారంగా…

కాలిఫోర్నియాకు చెందిన బ్రయాన్ జాన్సన్ అనే వ్యాపార వేత్త వయస్సు 45 ఏళ్లు. బయోటిక్ మేథావిగా అమెరికాలో ఆయనకు మంచి పేరుంది. 45వయస్సు లోనూ 18 ఏళ్ల యువకుడిలా కనిపించాలనే తాపత్రయంతో ప్రత్యేకంగా వైద్య చికిత్సల కోసం బోలెడంత ఖర్చు చేస్తున్నాడు. ఏడాదికి 2 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అది అక్షరాలా రూ. 16,29,68,990… యవ్వనం పొందడం కోసమే ఖర్చు పెడుతున్నాడు. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం … శరీరంలో కొన్ని మార్పులు చేస్తే వయస్సు ప్రభావం కనిపించకుండా దీర్ఘాయువు పొందవచ్చని జాన్సన్ ఎక్కడో చదివారు. దీంతో 18 ఏళ్ల వయస్సులో తాను ఎలా కనిపించేవాడో తిరిగి ఆ రూపం తెప్పించుకోవాలన్న కోరికతో వైద్యులను సంప్రదించారు. ఈమేరకు ఆలివర్ జోల్మాన్ నేతృత్వం లోని వైద్యుల బృందం జాన్సన్‌కు వృద్ధాప్య ఛాయలు రాకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది.

చికిత్స తర్వాత శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్ధం 18 ఏళ్ల యువకుడిలా , గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా , చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నట్టు జాన్సన్ మీడియాకు వెల్లడించారు. జాన్సన్ శరీర భాగాల పనితీరును తెలుసుకొనేందుకు నిత్యం 30 మంది వైద్యులు అతడిని పర్యవేక్షిస్తున్నారట. దీని కోసం కాలిఫోర్నియా లోని జాన్సన్ ఇంట్లో భారీ ఖర్చుతో ప్రత్యేక పరికరాలతో కూడిన ల్యాబ్‌ను కూడా సిద్ధం చేసినట్టు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ ఏడాది కూడా 2 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టడానికి జాన్సన్ సిద్ధంగా ఉన్నారు. తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్ర పిండాలు, దంతాలు, ఇలా ప్రతి అవయవం 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తానని జాన్సన్ చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News