Thursday, December 19, 2024

పిల్లలు గూండాలు కావాలంటే బిజెపిలో చేరండి

- Advertisement -
- Advertisement -

Join BJP if children want gangsters

కురుక్షేత్రలో ఆప్ నేత కేజ్రీవాల్ వ్యాఖ్య

కురుక్షేత్ర : తమ పిల్లలు గూండాలు, విధ్వంసకారులు, రేపిస్టులు కావాలనుకునే వారు బిజెపిని ఆశ్రయించవచ్చు, సంప్రదించవచ్చునని ఆమ్‌ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. భావితరాలను పూర్తిగా చెడగొట్టే రీతిలో బిజెపి ఓ శిక్షణా కేంద్రం అయిందన్నారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తమ పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తూ కురుక్షేత్ర సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు , లాయర్లు కావాలనుకునే వారు తమతో కలిసి రావచ్చునని, విధ్వంసకారులు కావాలనేకునే వారు బిజెపితో సాగవచ్చునని చెప్పారు. యువతకు ఈ బిజెపి ఉద్యోగాలు కల్పించదు. ఎందుకంటే వారికి నిరుద్యోగ గుండాలు అవసరం , వారిని అల్లర్లకు వాడుకుంటారు. ఆ నేతలు త పిల్లలను విదేశాలకు పంపిస్తారని అన్నారు. బిజెపిపై తీవ్రస్థాయి విమర్శలకు దిగారు.

ఢిల్లీలో తమ ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందని, ప్రత్యేకించి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు పేద పిల్లలకు ప్రామాణిక చదువులు అందిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఢిల్లీలో దాదాపు 4 లక్షల మంది ప్రైవేటు స్కూలు విద్యార్థులు సర్కారు బడులలో చేరారని తెలిపారు. తాను సామాన్యుడిని అని, రాజకీయాలు తెలియవని, అయితే ప్రజల కోసం పాటుపడటం తెలిసినవాడినని చెప్పారు. ఇక ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతూ తనకు ఈ పొత్తులు కుదుర్చుకోవడం తెలియదని, ఇందులో పూర్ అని , అయితే దేశంలోని 130 కోట్ల మంది జనం అందులోని రైతులు, కూలీలు, కార్మికులు, డాక్టర్లు ఈ విధంగా అనేక వర్గాల వారితో తాను అనుబంధం పొత్తు కుదుర్చుకుంటానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News