Sunday, January 19, 2025

బిజెపిలో చేరకపోతే బుల్‌డోజర్లే

- Advertisement -
- Advertisement -

గుణ/భోపాల్ : బిజెపిలో చేరండి లేకపోతే ముఖ్యమంత్రి బుల్‌డోజర్ కూల్చివేతలకు సిద్ధం కండని మధ్యప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలకు ఈ మంత్రి వెలువరించిన బెదిరింపులు వివాదాస్పదం అయ్యాయి. బుధవారం రుతియాయి పట్టణంలో బహిరంగ సభలో మంత్రి ఈ వ్యాఖ్యానాలకు దిగారు. ఇవి ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ప్రాచుర్యం పొందాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు బుల్‌డోజర్లను దింపడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు.

చౌహాన్‌ను బిజెపి వారు ఎక్కువగా మామా అని ముద్దుగా పిలుస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రి కాంగ్రెస్ నేతలను ఉద్ధేశించి పార్టీనీ విడుతారా లేక మామాజీ బుల్‌డోజర్లకు గురి అవుతారా? అని చురకలకు దిగారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ మధ్యప్రదేశ్ జనం పిరికిపందలు కాదని పలు యుద్ధాలలో ఆరితేరిన వారని ఎదురుదాడికి దిగారు. మంత్రి తిరోగమన ధోరణికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్యాని రఘోఘడ్ ఎమ్మెల్యే జైవర్థన్ సింగ్ విమర్శించారు. బిజెపికి ప్రజలను బాగు చేయడం చేతకాకపోవడం వల్లనే ఈ విధంగా బెదిరింపు బాపతుగా మారారని స్థానిక కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News