Monday, December 23, 2024

సీఎం కేసీఆర్ పాలనను చూసి బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -
  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

దామెర: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్‌లో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. అన్ని వర్గాల పరజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ఎనలేని ఆదరణ లభిస్తుందన్నారు. నిరుపేదల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందన్నారు. అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ సముచిత న్యాయం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News