Monday, December 23, 2024

బిజెపి నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు

- Advertisement -
- Advertisement -

మల్దకల్ : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామానికి చెందిన బిజెపి పార్టీ నాయకులు ఆశన్న, నర్సిములు, బిజెపి పార్టీని విడిచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మరికొంత మంది బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News