Wednesday, December 25, 2024

బిజెపి నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు

- Advertisement -
- Advertisement -

గట్టు: బిఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం బిఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి వారికి బిఆర్‌ఎస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండ్ల జ్యోతి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది పార్టీలో చేరుతున్నారని, ఇదీ ఎంతో శుభ పరిణామం అని అన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌ను బలపరుస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్న ప్రజల తీరు ఎంతో హర్షణీమమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, వీరేష్‌గౌడ్, కురుమన్న, జాంపల్లి భరత్‌సింహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News