Monday, December 23, 2024

ఎమ్మెల్యే ఆరూరి సమక్షంలో బిజెపి నుంచి బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామానికి చెందిన బీజేవైఎం యూత్ ప్రెసిడెంట్ గోనెల శ్రీకాంత్ బీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో బీజేపీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో గుర్రపు రాజు, నిరంజన్, చేరాలు, కుమారస్వామి, దేవేందర్, రవీందర్, సుమన్, అశోక్, అనిల్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ ఛైర్మన్ రాజేష్, మాజీ కార్పోరేటర్ బానోతు కల్పన సింగ్‌లాల్, డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, కుమార్, శ్రీను, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఏనుమాములకు చెందిన పలువురు యువతను బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గనిపాక శివ, బూతం రాజు, రఫీ, రాజేష్, ఖాదర్, నటరాజ్, కొమురయ్య, ముఖేష్, ఐలయ్య, శ్రావణ్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News