Friday, December 20, 2024

ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది గులాబి దళంలో చేరడం రివాజుగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడుతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ సొసైటీ డైరెక్టర్ అజ్మీర రాజు, వార్డుసభ్యులు అజ్మీర భద్రు, అజ్మీర గాగమ్మ, గుగులోతు ఈర్య, బానోతు రమేశ్, బానోతు చందా, భూక్య అనిత, అజ్మీర అనిత, అజ్మీర యాకూబ్, అజ్మీర మౌనికలతోపాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు.

వీరికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గులాబి కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడ సమ్మునాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు అజ్మీర బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ అజ్మీర బాలాజీ, ఈర్య, రెడ్యా, భద్రు, కిషన్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News