Sunday, December 22, 2024

బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:ఆలేరు నియోజకవర్గంలోని పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం మాజీ ఎంపీటీసీ పా ండవుల రాములు ఆధ్వర్యంలో సుమారు 200 మంది బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య వారికి పార్టీ కండువాకప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపి ప్రభుత్వాల మోసపూరిత హామీలతో ప్రజలు విసిగిపోయారని, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్‌లో చేరినవారిలో బొట్టు అయిలయ్య, మధుసూదన్‌రెడ్డి, చామల వేణుగోపాల్‌రెడ్డి, అబ్బాస్, మన్నె రాములు, కంచర్ల ప్రదీప్‌రెడ్డి, జానారెడ్డి, బొట్టు అనిల్, కొండలరావు, నవీన్‌రెడ్డి, విక్రమ్ తదితరులు పా ల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుడుదల నగేష్, టీపీసీసీ సెక్రటరీ జనగాం ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు మధుసూదన్‌రెడ్డి, ఈరసరపు యాదగిరిగౌడ్, నందరాజు, తదితరులు పాలొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News