Wednesday, January 22, 2025

మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా కోహెడలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మంత్ని పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. బిఆర్ఎస్ మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు కాంగ్రెస్ లో చేరారు. వారికి పొన్నం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని తెలిపారు. హామీలు అమలు చేస్తే బిజెపి నేత బండి సంజయ్ పోటీ నుంచి తప్పుకుంటానన్నారని గుర్తుచేశారు. పదేళ్ల బిజెపి పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో సంజయ్ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. బిజెపి ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపించాలన్నారు. బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్ లో పోటీ నుంచి తప్పుకుంటామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News