Friday, December 27, 2024

బిఆర్‌ఎస్ పార్టీలో చేరికలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన 100మంది ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండావాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలిచావులు ఉండేవని, నేటి కెసిఆర్ పాలనలో రాష్ట్రం లో ప్రజలు మూడుపూటలు కడుపు నింపుతున్న ఘనగ సీఎం కెసిఆర్‌కే ద క్కిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ 24 గంటల అ ందిస్తున్నామన్నారు.

యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కో సం నిరీక్షిస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలనే పకడ్బందీగా అమలవుతున్నాయంటూ కితాబిచ్చారు. దేశ రాజకీయాల్లో పెను ప్రకంకపలను సృష్టించినన కేసిఆర్ పాత్ర కీలకం కానుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News