Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: కంగ్టి మండల పరిధిలోని నాగూర్ ( బి ) గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాశీనాథ్‌పాటిల్, యువత, నాయకులు పండరిల ఆధ్వర్యంలో సుమారు 50మంది బీఆర్‌ఎస్ నాయకులు, 20 కుటుంబ సభ్యులు పీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డిల సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనన్నారు.

రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్ర స్పూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పట్లోళ్ల సుధాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శంకర్‌సేట్, కౌన్సిలర్లు సద్దాం, హన్మండ్లు, రాజేష్‌చౌహాన్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శంకర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News