Thursday, December 19, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

- Advertisement -
- Advertisement -

కామరెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 25 వ వార్డు నుండి 25 కుటుంబాలకు చెందిన వంద మంది బుధవారం మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హాయంలో ప్రతి కుటుంబానికి అన్యాయం జరిగిందన్నారు. ఇంట్లో నలుగురికి పెన్షన్ ఉన్న రద్దు చేసి ఒకరికి మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశానంటుతున్నాయి, మంచినూనె కూరగాయలు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ప్రతిదానిపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయి అధిక ధరలు ప్రజల చావుకు వచ్చిందన్నారు.

వచ్చేది కాంగ్రెస్ ప్ర భుత్వమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్లు లేని ప్ర తి పేదవానికి ఇళ్లు కట్టిస్తామన్నారు. నాలుగు వేల పింఛన్ అందే విధంగా అమలు చేస్తామన్నారు. రూ 500 లకే గ్యాస్ సిలెండర్ అందిస్తామన్నారు. కాంగ్రేస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాల్‌రాజ్, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీను, కౌన్సిలర్ శివ కృష్ణమూర్తి, బీబీపేట్ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News