Monday, December 23, 2024

ఎంపి అరవింద్ సమక్షంలో బిజెపిలో చేరికలు

- Advertisement -
- Advertisement -

బోధన్ : బిజెపి బోధన్ నియోజకవర్గ సీనియర్ నాయకులు వడ్డీ మోహన్‌రెడ్డి , మేడపాటి ప్రకాష్‌రెడ్డిల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ సమక్షంలో ఎడపల్లి మండల ఎఆర్‌పి క్యాంప్ గ్రామ బిఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అలేఖ్య మహేష్‌గౌడ్ తోపాటు వారి అనుచరులు 50 మందితో కలిసి, బ్రాహ్మణపల్లి గ్రామ ఉప సర్పంచ్ పురమొల్ల హన్మంతు, వార్డు సభ్యులు టి.హన్మంతు, ఎస్.సుజాత, ఎర్రొళ్ల రజిత, రాకాసిపేట్ నరేష్, పోచారం సభ్యులు , గ్రామస్తులు పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా అసెంబ్లీ కన్వీనర్ శైలేష్‌కుమార్ , ఎడపల్లి బిజెపి మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, జిల్లా ఓబిసి మోర్చా కార్యదర్శి యాసడా నర్సింగ్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు సిహెచ్.పోశెట్టి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు సురేష్, జాన్కంపేట్ సర్పంచ్ పొట్టోళ్ల సాయిలు, పోచారం సర్పంచు ఇంద్రకరణ్, ఎడపల్లి మండల ఉపాధ్యక్షుడు బండారి నర్సింలు, బిజెపి కార్యకర్తలు గొడుగు హనుమంతు, వెంకటేష్, కాపెల్లి రాజు, పవన్, సాయి, అభిలాష్, హనుమంతు మహేష్, పోచారం సభ్యులు భూమేశ్వర్ చారి, రాజ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News