Wednesday, December 4, 2024

మూడు అంశాలపై ఏకాభిప్రాయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎక్సైజ్‌కు రూ.81కోట్లు చెల్లించేందుకు ఎపి సుముఖత
ఎపి, తెలంగాణ మధ్య రూ.861కోట్ల లేబర్ సెస్ పంపిణీకి చర్యలు
మాదకద్రవ్యాల రవాణా నివారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు
చేయాలని నిర్ణయం కొలిక్కిరాని 9,10 షెడ్యూల్‌లోని ఆస్తుల
పంపకం విద్యుత్ బకాయిలపై తేలని పంచాయితీ మరో మారు
సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల సిఎస్‌ల నిర్ణయం

మనతెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల విభజన అంశాలపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రా యం కుదిరినట్టుగా తెలిసింది. మిగతా అం శాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రా ల సిఎస్‌లు నిర్ణయించినట్టుగా సమాచారం. తెలంగాణ సిఎస్ శాంతికుమారి, ఎపి సిఎస్ నీరబ్ కుమార్ నేతృత్వంలో సోమవారం మంగళగిరిలోని ఎపిఐఐసీ ఆఫీస్‌లో జరిగిన అధికారుల కమిటీల భేటీ రెండుగంటలకు పై గా జరిగింది. ఈ సమావేశంలో భాగంగా 9, 10 షెడ్యూల్‌లోని ఆస్తుల పంపకానికి సం బంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. దీంతోపాటు విద్యుత్ బకాయిల అంశాలకు సంబంధించి ఇరురాష్ట్రాల మధ్య పంచాయితీ తేలకపోవడంతో రెండు, మూడు సార్లు విద్యుత్ బకాయిలపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

డ్రగ్స్ నివారణపై జాయింట్ కమిటీ
ఇరు రాష్ట్రాలను ఇబ్బందులను పెడుతున్న డ్రగ్స్ నివారణపై జాయింట్ కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించినట్టుగా సమాచారం. అందులో భాగంగా పోలీస్, ఎక్సైజ్‌శాఖలతో ఈ జాయింట్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు ఉద్యోగుల విభజనకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలిసింది. దీంతోపాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి అదనంగా వసూలు చేసిన రూ.81 కోట్లను తిరిగి చెల్లించేందుకు కూడా ఎపి ఈంగీకారం తెలిపినట్టుగా సమాచారం. వీటితో పాటు ఎపి, తెలంగాణల మధ్య రూ.861 కోట్ల లేబర్‌సెస్ పంపిణీకి ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపినట్టుగా తెలిసింది.

వృత్తిపన్ను పంపకం, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే
ముఖ్యంగా విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉన్న 9,10 షెడ్యూల్ లోని సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడిపై చర్చించినట్లుగా తెలిసింది. పంపకాలు కాకుండా మిగిలిపోయిన అంశాలపై వారు చర్చించినట్టుగా సమాచారం. వృత్తిపన్ను పంపకం, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం. 9,10 షెడ్యూల్‌కు సంబంధించి ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపంకం కాకుండా మిగిలిపోయిన రూ.8 వేల కోట్ల అంశం కూడా చర్చించినట్టుగా తెలిసింది.

రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై ఎపిలో జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ ఏడాది జూలై 5వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభనజన సమస్యలపై హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సమావేశం కాగా, ఈ సమావేశానికి కొనసాగింపుగా సోమవారం ఉన్నతస్థాయి అధికారుల కమిటీ భేటీ అయ్యింది. ఈ కీలక భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రఘనందన్ రావు హాజరు కాగా, ఎపి నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్‌కుమార్, సాధారణ పరిపాలన శాఖ సురేష్‌కుమార్, బాబు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News