Monday, December 23, 2024

1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి పరీక్ష?

- Advertisement -
- Advertisement -

Joint examination for replacement of 1,061 Assistant Professor posts?

రాత పరీక్ష, ఇంటర్వూ ప్రక్రియ ద్వారానే ఎంపిక
భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నేడు వైస్‌ఛాన్స్‌లర్లతో చర్చించనున్న మంత్రి సబిత

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించనున్నట్లు తెలిసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఎలాంటి అక్రమాలు జరుగకుండా జాగ్రత్త పడవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. గతంలో పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉండేది కాదని, అయితే ప్రతిభ కలిగిన వారిని గుర్తించేందుకు ఈ ప్రక్రియ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో విశ్వవిద్యాలయాల వారీగా పోస్టులను భర్తీ చేసేవారు. అలా చేయడం వల్ల ఆయా విశ్వవిద్యాలయాల్లో అక్రమాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అన్ని విశ్వవిద్యాలయాల పో స్టులన్నింటికీ కలిపి రాష్ట్రస్థాయిలో ఏకీకృత రాత పరీ క్ష పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇలా భర్తీ చే యడం వల్ల అక్రమాలు జరగకుండా అడ్డుకోవచ్చని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. రాత పరీక్ష, ఇం టర్వ్యూల కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలా లేక టిఎస్‌పిఎస్‌సి ద్వారా పరీక్ష నిర్వహించాలా అనే అంశం తేలాల్సి ఉంది. ఉమ్మడి పరీక్ష, ఇంటర్వూల ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తే ప్ర త్యేక బోర్డు లేదా టిఎస్‌పిఎస్‌సి ద్వారా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహిస్తే ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందు కు అవసరమైతే చట్ట సవరణ చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

నేడు విసిల సమావేశం

విద్యా మంత్రి సబిత అధ్యక్షతన బుధవారం వైస్‌ఛా న్స్‌లర్ల సమావేశం జరుగనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్‌ఛైర్మన్ వెంకటరమణ, యూనివర్శిటీల వైస్‌ఛాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వర్శిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, తరగతులు, పరీక్షల నిర్వహణ, ప్రవేశాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా వర్శిటీలలో పోస్టుల భర్తీపై అనుసరించాల్సిన విధానంపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని వర్శిటీలలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే అనుమతించిన నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పోస్టులను వేగంగా భర్తీ చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోస్టుల భర్తీలో న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా అసవరమైన చట్ట సవరణ చేయల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News