Sunday, December 22, 2024

ఓట్ల కోసం హనుమంతుడిని కూడా వదల్లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో బిజెపి విద్వేష రాజకీయాలు చేస్తోందని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఓట్ల కోసం హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని లాలూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక ఎన్నికల్లో హనుమంతుడి కూడా ఓట్ల కోసం వాడుకున్నారని ఆయన విమర్శించారు. కర్నాటకలో బిజెపి విద్వేష రాజకీయాలు పనిచేయలేదని లాలూ పేర్కొన్నారు. బిహార్ పాట్నాలో శుక్రవారం విపక్ష నేతల సమావేశం నిర్వహించారు. విపక్షాల సమావేశానికి 17 పార్టీల నేతలు హాజరయ్యారు. సుమారు 4 గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ భేటీకి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మమతా బెనర్జీ, పవార్, ఉద్ధవ్ ఠాక్రే, డి.రాజా, ఏచూరి, అఖిలేశ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మెహబూబా ముఫ్తీ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News