Monday, December 23, 2024

బెంగళూరులో రెండో రోజు విపక్షపార్టీల సమావేశం ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్నాటకలో రెండో రోజు విపక్షపార్టీల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విపక్ష పార్టీల నేతలు ప్రధానంగా 6 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యుపిఎ పేరు మార్పు అంశంతోపాటు విపక్షాల కూటమి కో ఆర్డినెట్‌కు సబ్‌కమిటీ ఎంపిక చేయడంపై చర్చించనున్నట్లు సమాచారం.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక కోసం సబ్‌కమిటీ పనిచేయనుంది. దీంతోపాటు దేశవ్యాప్త ప్రధాన సమస్యలను గుర్తించి ఉమ్మడి పోరుకు ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News