Friday, November 22, 2024

చికున్‌గున్యాతో ఒళ్లు గుల్ల

- Advertisement -
- Advertisement -

రెండు నెలలైనా తగ్గని కీళ్ల నొప్పులు
కనీసం నిటారుగా నిలబడలేకపోతున్న
వృద్ధులు బాధితుల్లో కనిపిస్తున్న
కొత్త లక్షణాలు నమూనాలు
సేకరించి పూణె వైరాలజీ ల్యాబ్‌కు
పంపిన ఫీవర్ ఆసుపత్రి వైద్యులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలను వైరల్ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ఈసారి ఎన్నడూ లే నివిధంగా ఇప్పుడు చికున్ గున్యాతో కీళ్ల నొప్పులు విపరీతంగా వేధిస్తున్నాయి. కొంతమందికి రెండు, మూడు రోజులకు జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్లీ వ స్తోంది. శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. రెండు, మూడు వారాలకు పైగా కీళ్ల నొ ప్పులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. చికున్ గున్యా బారినపడిన కొందరు రెండు నెలులకు మించి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నొ ప్పుల వల్ల మహిళలు, వయసు పైబడిన వాళ్లు ని టారుగా నిల్చోలేక అవస్థలు పడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారైతే అడుగు తీసి అ డుగు వేయాలంటే నొప్పులతో సతమతమవుతున్నారు.

ఒకరికి ఫీవర్ వస్తే ఇంట్లో ఉన్న అందరికీ అంటుకుంటోంది. ఈ సమస్యను భరించలేక క రోనా సమయంలో ధరించినట్లు ఇంట్లోనూ మా స్కులు పెట్టుకుంటున్నారు. విడివిడిగా ఉండేందు కు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా జూన్ చివర లేదా జులై మొదటి వారంలో ప్రారంభమై అక్టోబర్ తొలి వారం నాటికి జ్వరాలు తగ్గుముఖం పడతా యి. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో వైరల్ జ్వరం వస్తే మం దు లు వాడినా, వాడకున్నా 3, 4 రోజుల్లో తగ్గేది. ప్ర స్తుతం 7 నుంచి 10 రోజులు ఉంటూ జనాలను సతమతం చేస్తుంది.

ఈ సమయంలో సీజనల్ ఫ్లూ సాధారణంగా వస్తుంది. ఇప్పుడు వచ్చే దగ్గు, జలు బు ఎక్కువ రోజులు ఆరోగ్యాన్ని వేధిస్తున్నాయి. ఐ దారు రోజుల్లో తగ్గాల్సిన జలుబు రెండు, మూడు వారాలకు పైబడి వెంటాడుతోంది. ఎడతెరపి లేని దగ్గుతో ఎక్కువ మంది గొంతు నొప్పితో బాధపడుతున్నారు. పలువురికి ముక్కు, చెంపలు, కళ్ల కింద నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. సాధారణంగా వైరల్ జ్వరం నిర్ణీత కాలంలో దానంతట అదే తగ్గుతుంది.

వైరస్ చక్రం ముగింపునకు సమీపిస్తున్న కొద్దీ లక్షణాలు తగ్గుతాయి. ఈసారి కాస్త భిన్న పరిస్థితులు ఉన్నందున వ్యక్తిగ త పరిశుభ్రత పాటిస్తూ, తాజా ఆహారం తీసుకుంటూ, రోగ నిరోధక శక్తిని పెం పొందించుకునేందుకు మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది లాఉంటే ఫీవర్ ఆసుపత్రిలో ఈసారి చికున్‌గున్యా కేసులు వందకు పైగా న మోదయ్యాయి. గత ఏడాది ఏడు చికున్ గున్యా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, ఈసారి ఈ కేసులు గణనీయంగా పెరిగాయి. అయితే గతం లో 15 నుంచి 20 రోజుల్లో కీళ్ల నొప్పులు తగ్గేవని, ఈసారి మాత్రం రెండు నెలలైనా నొప్పులు తగ్గడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.

చికున్ గున్యా సంకేతాలు

సాధారణంగా చికున్ గున్యా వచ్చిన వారికి అధిక జ్వరం ఉంటుంది. కీళ్ల నొప్పు లు, కాళ్లు నొప్పులు అధికంగా ఉంటాయి. చేతులు, కాళ్లు భుజాలు, పాదాల్లో నొప్పి పుడతాయి. తలనొప్పితో పాటు అలసట, కండరాల నొప్పి కూడా ఉం టుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. జ్వరం తగ్గినా కూడా ముఖంపై ఇలా నల్లబడటం అనేది ఇప్పుడు కొత్తగా తెలిసిన లక్షణం.

కొత్త లక్షణాలు

చికున్ గున్యా కేసులు ఈసారి ఎక్కువగా నమోదవుతున్నాయి. చికున్ గున్యా సోకిన వారికి సాధారణంగా రెండు వారాలలో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కానీ ఈసారి మాత్రం చికున్ గున్యా సోకిన తర్వాత రెండు నెలలైనా నొప్పులు రావడం లేదు. దాంతోపాటు ముక్కుపై దద్దుర్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చికున్ గున్యాతో సంబంధంలేని లక్షణాలు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా చికు న్ గున్యా వచ్చిన వారిలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాధిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చికున్ గున్యా బాధితులు నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో కొన్ని ఆసుపత్రులు నొప్పులు తగ్గించేందుకు స్టిరాయిడ్, పెయిన్ కిల్లర్ ఔషధాలు వాడుతున్నట్లు తెలిసింది. ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ వైద్యులు.. నొప్పులంటూ తమ వద్ద కు వస్తున్న రోగులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు అడ్డగోలుగా స్టిరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు సమాచారం. అయితే స్టిరాయిడ్ల విచ్చలవిడి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిసినా వాటిని వినియోగిస్తున్న ట్లు తెలిసింది.

శాంపిల్స్ పుణె ల్యాబ్‌కు పంపించాం

చికున్ గున్యా కేసులు గతేడాది కంటే ఈసారి ఎక్కువగా నమోదయ్యాయని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈసారి చికున్ గున్యా సోకిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తుండటంతో పాటు రెండు నెలలైనా బాధితులకు నొప్పులు తగ్గడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 30 మంది చికున్ గున్యా సోకిన వారి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌ను పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. వైరాలజీ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే వ్యాధికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News