Sunday, December 22, 2024

నవంబర్ 26న పార్లమెంట్ ఉమ్మడి సమావేశం?

- Advertisement -
- Advertisement -

భారత రాజ్యాంగ స్వీకరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక మ్మడి సమావేశం జరిగే అవకాశం ఉందని శనివారం అధికారులు వెల్లడించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ రజ్యాంగాన్ని ఆమోదించగా 1950 జనవరి 26న అది అమలులోకి వచ్చింది. సంవిధాన్ సభకు చెందిన సెంట్రల్ హాలులో లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం నవంబర్ 26న జరిగే అవకాశం ఉంది. నవంబర్ 26వ తేదీని ఇదివరకు జాతీయ న్యాయ దినోత్సవంగా పాటించేవారు. రాజ్యాంగ విలువల గురించి ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News