Wednesday, November 6, 2024

పోలవరం ముంపుపై ఉమ్మడి సర్వే

- Advertisement -
- Advertisement -

తెలంగాణ డిమాండ్‌కు అంగీకరించిన సిడబ్లూసి

ముంపు తగ్గింపు రక్షణ చర్యలకు ఆంధ్రప్రదేశ్ సుముఖం

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రా జెక్టు బ్యాక్ వాటర్ విషయంలో కేంద్ర ప్ర భుత్వం మెట్టు దిగింది. తొలినుంచి తెలంగాణ రా్రష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విధంగా పోలవరం ప్రాజెక్టు వెనుక జలా ల వల్ల ముంపుపై సంయుక్త సర్వేకు కేం ద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సు ప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం గత నెల భా గస్వామ్య రాష్ట్రాల ప్రతినిధులతో నిర్వహించిన టెక్నికల్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగా శుక్రవారం సమావేశం ని ర్వహించింది. కేంద్ర జల వనరుల సం ఘం చైర్మన్ ఆర్.కె.గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో పోలవ రం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో పాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. గో దావరి నది పరీవాహకంగా భారీ వర్షా లు, ఇటీవల గోదావరి నదికి వచ్చిన భారీ వరదలు, పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ద్వా రా వరద నీటి విడుదల సామర్థ్ధం, పోలవరం ప్రాజెక్టుకు ఎగువన బ్యాక్ వాటర్ ప్రభావం, గోదావరి నదికి ఇరువైపులా వ రద ముంపు విస్తరణ పాంత్రాలు, ముం పును తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్య లు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న తె లంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్‌సి మురళీధర్ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వర ద ముంపు నష్టాలను సమావేశం దృష్టికి తెచ్చారు. గోదావరి నది పరీవాహకంగా రాష్ట్రంలోని ఏడు మండలాల పరిధిలో సు మారు 150 గ్రామాలపైన వరద ముంపు ప్రభావం పడిందని తెలిపారు. 28వేలకు పైగా ఆవాసాలపై బ్యాక్ వాటర్ ప్రభావం పడిందని, 11వేల కుటుంబాలు నష్టపోయాయని, అంతేకాకుండా 50వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు కూడా పోలవరం బ్యాక్ వాటర్‌లో మునిగినట్టు వివరించారు. ఐఐటి సంస్థ పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం నిర్వహించిన సర్వే నివేదిక, 58లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి తదిత ర అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం వెలిబుచ్చిన అభిప్రాయాలకు చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు కుడా శృతి కలిపి మద్దతు తెలిపాయి. దీంతో కేంద్ర జల వనరుల సంఘం పోలవరం ముంపు ప్రభావంపై సంయుక్త సర్వేకు సుముఖత తెలిపింది.

గోదావరి వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ అవార్డు అనంతరం గోదావరి నది పరీవాహకంగా చోటుచేసుకున్న వాతావరణ మార్పులు, తక్కువ కాలంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, గోదావరి నదిలో వరద ఉధృతికి నదికి ఇరువైపులా పెరుగుతున్న మునక ప్రాంతాలు, పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకూ విస్తరించే కాంటూర్ లెవల్స్ , బ్యాక్ వాటర్ పోటు వల్ల గోదావరి ఉప నదులు పొంగి ఇరువైపులా జరిగే ముంపు నష్టాలు తదితర అంశాలన్నింటిపైనా సమగ్ర అధ్యయనం జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లకు కేంద్రం సుముఖత తెలిపింది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వరద ముంపు ఇదివరకటికంటే పెరుగుతుందన్న ప్రాథమిక అంచనాలను అంగీకరించింది. అధునాతన సాంకేతిక పరికరాల ద్వారా సమగ్ర అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకతను సిడబ్ల్యూసి కూడా గుర్తించింది.

ఈ నెల 9నాటికి అధ్యయానికి అవసరమైన ఇతర సమాచారాన్ని కూడా అందజేయాలని తెలంగాణతో పాటు ఇతర భాగస్వామ్య రాష్ట్రాలకు సూచించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల బ్యాక్ వాటర్ ముంపు నష్టాలను తగ్గించేందుకు పూర్తిగా సహకారం అందిస్తామని ఆంధప్రదేశ్ ప్రభుత్వం సమావేశంలో వివరించింది. వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, ఏపి ఈఎన్‌సి నారాయణరెడ్డి, చత్తీస్‌గఢ్ ఈఎన్‌సి వి.కె ఇంద్రజిత్, ఒడిశా ఈఎన్‌సి అశితోష్ దాస్, తెలంగాణ రాష్ట్ర ఈఎన్‌సి మురళీధర్‌తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే, కొత్తగూడెం సిఇ శ్రీనివాస్‌రెడ్డి, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ కన్సల్టెంట్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News