Wednesday, January 22, 2025

బ్రిటన్ కేబినెట్‌లో కుదుపు

- Advertisement -
- Advertisement -

హోం మంత్రి బ్రేవర్‌మన్ ఔట్
ఆమె స్థానంలో జేమ్స్ క్లెవెర్లీ
విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని కామెరాన్‌ను నియమించిన రిషి సునాక్

లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తమ కేబినెట్‌లోని హోం మంత్రి , భారతీయ సంతతి వ్యక్తి సుయెల్లా బ్రెవర్మన్‌ను బర్తరఫ్ చేశారు. ఆమె స్థానంలో ఈ బాధ్యతలను జేమ్స్ క్లెవెర్లీకి అప్పగించారు. మరో కీలక పరిణామంలో దేశ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను అసాధారణ రీతిలో కొలువులోకి తీసుకుని దేశ విదేశాంగ మంత్రి బాధ్యతలు కట్టబెట్టారు. ఉదయం జరిగిన కీలక సమావేశంలో బ్రెవర్మన్ బర్తరఫ్ జరిగింది. ఇందుకు కారణం గురించి అనేక విధాలుగా ప్రచారం జరిగింది. అయితే మెట్రోపాలిటన్ పోలీసు వ్యవస్థను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఇటీవలే ఓ వార్త వెలువడటం, దీనికి ప్రధాని అనుమతి లేకపోవడంతో విషయం తీవ్రస్థాయికి చేరి, ఆమెపై వేటుకు దారితీసిందని వెల్లడైంది. బ్రెవర్మెన్ ఆది నుంచి వివాదాస్పదం కావడంతో భారతీయ సంతతి మూలాల విషయం పక్కనపెట్టి ప్రధాని సునాక్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

ఆమె వార్తాకథనంతో లండన్‌లో పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చారని విమర్శలు తలెత్తాయి. దేశ హోం మంత్రి చర్య ప్రధానిని ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు కీలకమైన హోం మంత్రి బాధ్యతలను క్లెవెర్టీకి అప్పగించారు. ఇప్పటివరకూ ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీకావల్సిన దశలోనే ఆయనకు స్థానచలనం జరిగింది. మాజీ ప్రధానికి ఈ బాధ్యతలు అప్పగించారు. కొత్త విదేశాంగ మంత్రి కెమెరాన్ ఇప్పుడు చట్టసభ సభ్యులుగా లేరు. పద్ధతి ప్రకారం ఆయన పార్లమెంటరీ ప్రోటోకాల్ పరిధిలోకి రావాలంటే ముందు సభ్యులు కావల్సి ఉంటుంది. దీనితో జైశంకర్‌తో చర్చలు డోలాయమానంలో పడ్డాయి. బారతీయ సంతతికి చెందిన బ్రెవెర్మన్ మంత్రిత్వ బాధ్యతల నియమ నిబంధనలను ఉల్లంఘించారని ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రస్థాయి విమర్శలు ఎదురయ్యాయి. దీనితో రిషి సునాక్ వెంటనే చర్యకు దిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News