Thursday, January 23, 2025

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్

- Advertisement -
- Advertisement -

ముంబై : మాజీ దిగ్గజం, సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు జాంటీ రోడ్స్‌ను టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా నియమించనున్నారు. ప్రస్తుతం ప్రదాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఈ టి20 వరల్డ్ కప్ అనంతరం భాద్యతల నుంచి తప్పుకోనున్నాడు. దీంతో ప్రధాన కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన బిసిసిఐ ఫీల్డింగ్ కోచ్ వేటలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఐపిఎల్‌లో 17వ సీజన్‌కు కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన గౌతం గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తారనే వార్తలు షికారు చేస్తున్నాయి.

అయితే బిసిసిఐకి గంభీర్ కొన్ని కండీషన్లు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. సపోర్ట్ స్టాఫ్ నియామకం విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని గంభీర్ బీసీసీఐని కోరినట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది. ఈ క్రమంలోనే గంభీర్ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు, అందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితుడైన జాంటీ రోడ్స్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు తొమ్మిదేళ్ల్ల పాటు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన జాంటీ రోడ్స్.. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News