Friday, November 15, 2024

‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ సినిమా పెద్ద హిట్

- Advertisement -
- Advertisement -

సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ మోషన్ పోస్టర్‌ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో..

డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. ‘జోరుగా హుషారుగా షికారు పోదమ టీంకు ఆల్ ది బెస్ట్. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో నా ఫ్రెండ్ ప్రవీణ్ ఫోన్ చేశాడు. మంచి కథను విన్నాను.. సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం.. ఓ సారి కథ వినమని చెప్పాడు. సంతోష్ శోభన్ హీరో అన్నాడు. ఆ కథ చెప్పేటప్పుడే దేశం మంతా తిప్పుతున్నట్టుగా నెరేట్ చేశాడు. సిద్దార్థ్ కాలేజ్‌లో చదువుకునే టైంలో నా గ్యాంగ్ ఉండేది. మేం సెకండ్ షోలు చూసేవాళ్లం. ప్రవీణ్, నేను బాగానే చదువుకునేవాళ్లం. కానీ ఎక్కువగా సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం.

సినిమాలు తీయాలని అనుకునేవాళ్లం. మూడేళ్లుగా ప్రవీణ్‌ను చూస్తున్నాను. టీం కోసం, సుభాష్ కోసం అహర్నిశలు పని చేస్తున్నాడు. ప్రవీణ్ ప్యాషన్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రవీణ్ స్క్రిప్టులు కూడా రాస్తుంటాడు. సుభాష్ ఈ సినిమాకు న్యాయం చేశాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది. సంతోష్ శోభన్‌లో ఎంతో ఈజ్ ఉంటుంది. ఆయనకు పెద్ద సక్సెస్ రావాలి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను కూడా జోరుగా హుషారుగా షికారు పోదమ అనేలా తీసుకెళ్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘మొదటి సినిమా కదా? బాగానే తీస్తాడా? అని అనుకున్నాను. కానీ అద్భుతంగా తీశాడు దర్శకుడు సుభాష్. ప్రేక్షకుడికి విజువల్స్ కనిపిస్తాయి. కానీ నిర్మాతగా నాకు నా టీం కష్టం కనిపిస్తుంది. మా హీరోయిన్ వింధ్య ఎంతో సహకరించింది. సినిమా లేట్ అయినా కూడా మాతో పాటు నిలబడింది. కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే సినిమా తీశాను. మున్ముందు కూడా చేస్తాను’ అని అన్నారు.

దర్శకుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. ‘మా కోసం ఈవెంట్‌కు వచ్చిన క్రిష్, రాజ్ గారికి థాంక్స్. జోరుగా హుషారుగా షికారుగా పోదమ టైటిల్ ఎలా ఉందో.. ఎంత హాయిగా ఉందో సినిమా కూడా అలానే ఉంటుంది. లైట్ హార్టెడ్ ట్రావెల్ మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ సినిమాను చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకుంటారని చెప్పగలను. ఇండియా మొత్తం చుట్టి వచ్చినట్టుగా ఉంటుంది. నాలుగేళ్ల సమయం, మూడు వేల మంది కష్టం.. రెండు కరోనా లాక్డౌన్లు.. నా టీం సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత వరకు వచ్చింది. వారంతా ఒక్కటి ఉండటం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాను పూర్తి చేయగలిగామ’ని అన్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ‘స్వీట్ సింపుల్ ట్రావెల్ రామ్ కామ్ సినిమా. ఈ టీంలో చాలా మంది కొత్తవారు. మా అందరినీ ప్రవీణ్ ముందుండి నడిపాడు. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రవీణ్‌లో పెద్ద నిర్మాత అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనతో మళ్లీ సినిమా చేయాలని ఉంది. సుభాష్ పడిన కష్టం నాకు తెలుసు. వింధ్య పాత్రలో ఫల్గుణి అద్భుతంగా నటించింది. ఈ సినిమాతో మా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ ఫల్గుణి మాట్లాడుతూ.. ‘ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కన్నాను. మా సినిమా విడుదల కాబోతోంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సంతోష్‌కు థాంక్స్. సినిమా రిలీజ్ కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

కెమెరామెన్ సాయి సంతోష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఓ టీంలా వెకేషన్‌కు వెళ్లినట్టు చేశాం. నాకు ఎంతో సపోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్. మా నిర్మాత ప్రవీణ్, డైరెక్టర్ సుభాష్‌లకు థాంక్స్. మా సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ మాట్లాడుతూ.. ‘సుభాష్‌తో నాది పదమూడేళ్ల బంధం.షార్ట్ ఫిల్మ్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇదే మా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. నాకు సుభాష్ కావాల్సినంత ఫ్రీడం, టైం ఇచ్చారు. అందుకే ఇంత బాగా వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News