Tuesday, December 24, 2024

సిటీ చాంఫియన్స్‌ను ప్రారంభించిన జోష్‌ టాక్స్‌..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రాంతీయ కంటెంట్‌, అప్‌స్కిల్లింగ్‌ వేదిక జోష్‌ టాక్స్‌ ఇప్పుడు సిటీ చాంఫియన్స్‌ను ప్రారంభించింది. ప్రభావం చూపడంపై దృష్టి సారించిన పెట్టుబడుల సంస్ధ ఒమిడ్యార్‌ నెట్‌వర్క్‌ ఇండియా (ఓఎన్‌ఐ) మద్దతు కలిగిన కార్యక్రమమిది. బహుళ మాధ్యమాల ద్వారా చేసే ప్రచారంతో, ఈ కార్యక్రమం ద్వారా అర్బన్‌ ఛేంజ్‌మేకర్స్‌, భారతీయ నగరాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోన్న గ్రాస్‌ రూట్‌ సంస్ధలను కనుగొనడం, గుర్తించడం, ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకున్నారు. మార్చి 31, 2023 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నారు.

ఈ భాగస్వామ్య ప్రయత్నాల ద్వారా, జోష్‌ టాక్స్‌, ఓఎన్‌ఐలు పర్యావరణ అనుకూల నగరాలు, కమ్యూనిటీలను నిర్మించాలనే సస్టెయినబల్‌ డెవలప్‌మెంట్‌ గోల్‌, జీ20 ప్రాధాన్యతలైన ‘ఒన్‌ ఎర్త్‌, ఒన్‌ ఫ్యామిలీ, ఒన్‌ ఫ్యూచర్‌ ’(ఒకటే భూమి, ఒకటే కుటుంబం, ఒకటే భవిష్యత్‌)కు అనుగుణంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

వరల్డ్‌ అర్బనైజేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ (డబ్ల్యుయుఎస్‌) 2018 ప్రకారం 2050 నాటికి నగరాలలో దాదాపు 50%కు భారతీయులు నివాసముండనున్నారు. ఆర్ధికాభివృద్ధికి సైతం నగరాలు చోధకాలుగా నిలుస్తాయి. సిటీ చాంఫియన్స్‌ క్యాంపెయిన్‌ను ఎనిమిది విభిన్న రంగాలపై దృష్టి సారించారు. ఇవి మన నగరాల సమగ్ర అభివృద్ధికి మూల స్తంభంగా నిలిచిన రవాణా , వ్యర్ధ నిర్వహణ, నీరు మరియు పారిశుద్ధ్యం, సేవా డెలివరీ, ఆరోగ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ, పబ్లిక్‌ కామన్స్‌ నుంచి పరిమిత వనరులతో ఛేంజ్‌మేకర్స్‌కు సాధికారిత అందించడం నుంచి వారి ప్రభావాన్ని మెరుగుపరచడం మరియు మన కమ్యూనిటీలలో మార్పును తీసుకురావడం చేయనున్నారు

ఈ క్యాంపెయిన్‌కు సేవా భారత్‌, పిరామల్‌ ఫౌండేషన్‌, గూంజ్‌, డాక్టర్స్‌ ఫర్‌ యు, చారిటీస్‌ ఎయిడ్‌ ఫౌండేషన్‌, రీప్‌ బెనిఫిట్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ గ్రూప్‌ మరియు ప్రజా వంటి సంస్ధలకు చెందిన నిపుణుల బృందం మార్గనిర్దేశకత్వం చేయనుంది. పైన పేర్కొనబడిన ఎనిమిది థీమాటిక్‌ రంగాలలో పనిచేస్తోన్న అర్బన్‌ గ్రాస్‌రూట్‌ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. అభ్యర్ధులు ఈ దరఖాస్తులను https://www.joshtalks.com/citychampions/ వద్ద పొందవచ్చు.

ఈ క్యాంపెయిన్‌ నేపథ్యం గురించి సుప్రియా పౌల్‌, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈఓ, జోష్‌ టాక్స్‌ మాట్లాడుతూ.. ‘‘యువతకు తగిన చర్యలను తీసుకునేలా ప్రేరేపించగల, అనుసరించతగిన రోల్‌ మోడల్స్‌ కథలను ప్రదర్శించడం జోష్‌ టాక్స్‌ లక్ష్యం. ఆ దిశగా వేసిన ఓ ముందడుగు సిటీ చాంఫియన్స్‌. ఓఎన్‌ఐతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. దీనిద్వారా భారతదేశంలో ప్రాధమిక స్ధాయి నుంచి ఛేంజ్‌మేకర్స్‌ను వేడుక చేయనున్నాము. వారి ప్రయాణం, భావి తరాన్ని తమ సొంత నగరాలు మరియు కమ్యూనిటీలలో మార్పుకు ఏజెంట్లుగా మార్చగలవని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

‘‘నగర సమస్యలపై పనిచేస్తున్న ఛేంజ్‌ మేకర్స్‌ను గుర్తించడం ద్వారా, ఈ రంగంలో పనిచేస్తోన్న వ్యాపారవేత్తలకు సస్టెయినబల్‌ మద్దతు నెట్‌వర్క్‌ను సృష్టించడాన్ని సిటీ చాంఫియన్స్‌ లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యాపారవేత్తల లక్ష్యం, నగరాలను మెరుగుపరచడం, అలాగే నగర జనాభాలో దాదాపు 35%గా ఉండనున్న తరువాత 50 కోట్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం సృష్టించడం లో అది అత్యంత కీలకం. రాబోయే కాలంలో చాంఫియన్‌లను వెలుగులోకి తీసుకురావడానికి తోడ్పడే ఓ వేదికను నిర్మించడానికి జోష్‌ టాక్స్‌కు మద్దతు అందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’అని ఓఎన్‌ఐ (భాగస్వామి) శిల్పా కుమార్‌ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News