తొలుత తెలియదన్న రిటైర్డ్ సిఎస్ ఎస్‌కె జోషి జీవో చూపించడంతో అది
టెక్నికల్ కమిటీ అని చెప్పిన సీనియర్ ఐఎఎస్ జస్టిస్ పిసి ఘోష్ విచారణకు
హాజరైన జోషి, రిటైర్డ్ నీటిపారుదలశాఖ మాజీ కార్యదర్శి రజత్‌కుమార్
మన తెలంగాణ / హైదరాబాద్ : కాళేశ్వరం ప్రా జెక్టుపై రేవంత్ సర్కార్ నియమించిన కమిషన్ వి చారణ కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రా జెక్టులో అవకతవకలు, మేడిగడ్డ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ బుధవారం విచారణ ప్రారంభించారు. నీటిపారుదల శాఖ మాజీ కా ర్యదర్శి రజత్ కుమార్ విచారణకు హాజరయ్యా రు. ఈ నెల 24 వరకు ఆయన హైదరాబాద్ లో నే ఉండనున్నారు.
ఈ షెడ్యూల్‌లో మాజీ ఈఎన్‌సీలు సీ మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ బి.హరిరామ్, సీఎంవో మాజీ కార్యదర్శి స్మితా స భర్వాల్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో మేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితర అధికారులను క మిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఓపెన్ కోర్టు నిర్వహించిన కాళేశ్వరం జ్యుడీషియల్ క మిషన్ మొదట రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సె క్రటరీ శైలేంద్ర కుమార్ జోషిని విచారించింది. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా అ క్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చె ప్పిందని జోషి తెలిపారు.
ప్రాజెక్ట్ స్థలాన్ని ఎవరు మార్చారని కమిషన్ మరో ప్రశ్న వేయగా నాటి సీఎం కేసీఆర్, మం త్రులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని జోషి సమాధానం ఇచ్చారు. దీని పై ఏదైనా కేబినెట్ సబ్ కమిటీ వేశారా అని క మిషన్ అడగగా కేబినెట్ సబ్ కమిటీ ఏమీ లేదని జోషి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు? అని కమిషన్ ప్రశ్నించగా ఫండ్స్ కోసమని, పబ్లిక్ బాండ్స్ ఇష్యూ చేయలేదని సమాధానమిచ్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ప్రాజెక్ట్ నిర్మా ణం జరిగిందని ఎస్‌కే జోషి వెల్లడించారు. హైపవర్ కమిటీ గురించి కమిషన్ ప్రశ్నించగా దాని గురించి తెలియదని జోషి మొదట సమాధానం ఇచ్చారు.
అయితే కమిషన్ జీవో చూపించడంతో ఆయన ఒ ప్పుకున్నారు. అది టెక్నికల్ కమిటీ మాత్రమేనని వెల్లడించారు. మహారాష్ట్ర వైపు ముంపు ఎక్కువ ఉండడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కట్టారని తెలిపారు. కాళేశ్వరం కాంప్లెక్స్ ప్రాజెక్ట్ 28 ప్యాకేజీలు, 8 లింకులతో కట్టారన్నారు. ఒక్కసారే అప్రూవల్ లేదని, వివిధ సమయాల్లో ఆయా ప్యాకేజీలకు దాదాపు 200 అనుమతులు ఇచ్చి ఉంటారని చెప్పారు.