Monday, December 23, 2024

ఈ నేలమట్టమేనా?

- Advertisement -
- Advertisement -

జోషిమఠ్ అంతరించే ప్రాంతం
అధికారిక ప్రకటనలో నిర్థారణ
60 కుటుంబాల తరలింపు
మరో 90 కుటుంబాలకు స్థానచలనం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ పట్టణం జోషిమఠ్ కొండచరియలు విరిగిపడే ముంపు ప్రాంతం అని అధికారికంగా ప్రకటించారు. మునిగిపోతున్న ఈ పట్టణం నుంచి ఇప్పటివరకూ 60 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, తాత్కాలిక పునరావాస కేంద్రాలలో ఉంచినట్లు సీనియర్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇప్పుడు ఈ ప్రాంతపు భూమి పొరల్లోని ఒత్తిడి ఇతరత్రా శాస్త్రీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని దీనిని మునిగిపోయే ప్రాంతంగా నిర్థారించి ప్రకటించినందున వెంటనే మరో 90కు పైగా కుటుంబాలను వేరే చోటికి పంపించాల్సి ఉంటుంది. వేరే చోటుకు తరలిస్తున్న కుటుంబాల కోసం ఈ పట్టణంలోనే ఏర్పాటు చేసిన నాలుగు అయిదు సహాయక శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు గర్హ్‌వాల్ కమిషనర్ సుశీల్‌కుమార్ తెలిపారు. మరో వైపు పట్టణంలో ఛమోలీ జిల్లా కలెక్టర్ హిమాంశు ఖురానా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి, ఏర్పడ్డ పగుళ్లను పరిశీలించారు. తీసుకోవల్సిన జాగ్రత్త చర్యల గురించి వెంట ఉన్న ఉన్నతాధికారులకు ఆదేశాలు వెలువరించారు. మరో వైపు ఇళ్ల పగుళ్లతో వేరే చోట నివాసానికి వెళ్లాల్సి వచ్చిన కుటుంబాలకు నెలకు రూ 4 వేల వరకూ అద్దె చెల్లింపుల కోసం అధికార యంత్రాంగం నుంచి సాయం అందించేందుకు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News