ఇకపై ఆన్‌లైన్‌లోనూ 2/3 తగ్గింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. జర్నలిస్ట్ తమ టిఎస్‌ఆర్‌టిసి బస్‌పాసుతో ఆన్‌లైన్‌లోనూ టికెట్‌పై రాయితీ పొందడానికి అవకాశం కల్పించారు. ఆర్‌టిసి వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసే సమయంలో జర్నలిస్టు 2/3 తగ్గింపునకు అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఈ సూచనలు చేసిన వారికి థాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంది జర్నలిస్టులు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేశారు. ఫోటో జర్నలిస్టుల తరపున కెఎన్ హరి, ఇంకా పలువురు పాత్రికేయులు ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్‌లో సమాధానమిచ్చారు.
మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్ కార్డుతో ఆర్టీసీ బస్‌పాస్ తీసుకుంటారు. వాటితో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించరే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించే మినహాయింపును పొందుతుంటారు. నేరుగా కండక్టర్‌కు చూపించి ఇన్నాళ్లు జర్నలిస్టులకు లభించే కన్సెషన్ పొందేవారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగా టికెట్ బుక్ చేస్తే ఈ అవకాశాన్ని కోల్పో యేవారు. తాజాగా టిఎస్‌ఆర్‌టిసి వెబ్‌సైట్‌లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడూ జర్నలిస్టులు తమ కన్సెషన్ పొందేలా మార్పులు చేశారు. ఇదే విషయాన్ని ఆర్‌టిసి ఎండి సజ్ఝనార్ ట్విట్టర్‌లో వెల్లడించారు. గుడ్‌న్యూస్ ఫర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.