Monday, January 20, 2025

వేధింపులు తాళలేక విలేకరి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే అనుచరుల వేధింపులు తాళలేక రామగిరి వార్త విలేఖరి పొన్నం శ్రీకాంత్ (32) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడు శ్రీకాంత్ తన మరణ వాంగ్మూలాన్ని వాట్సప్ మేసేజ్ ద్వారా రామగిరి ఎస్‌ఐకు పంపించాడు. పోలీసులు వివరాల ప్రకారం… మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అనుచరులైన ఆర్జీ 3, ఐఎన్‌టియుసి ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి, పన్నూరు ఎంపిటిసి కొప్పుల గణపతితోపాటు సాక్షి విలేఖరి పొన్నం శ్రీనివాస్‌లు, చిందం రమేష్‌లు నిత్యం వేధింపులకు గురి చేశారని తన చావుకు ఎలాంటి విచారణ అవసరం లేదని, ఆ నిందితులు నలుగురిని కఠినంగా శిక్షించాలని శ్రీకాంత్ మరణ వాంగ్మూలం వాట్సాప్ మేసేజ్‌లో పెట్టి పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అలాగే తనకు ఇష్టమైన జర్నలిజం వృత్తిలో సహకరించిన బాలవర్ధన్, అనిల్‌రావు, వేణు, శ్రీకాంత్, రాజిరెడ్డి, సాయి శంకర్, సుకుమార్, నారు, చంద్రమోహన్, కుమార్, రవికుమార్, రత్నం, రవీందర్, మల్లేష్‌లు, మిత్రులు, సారన్న, మేనేజర్ బీబీఆర్, నాగరాజు, రమేష్‌లు మీరంతా క్షమించాలని, తన మామ అత్త, అక్క బావ, ఇద్దరన్నలు, వదినలు, సుదన్న అందరూ బాగుండాలని అందులో అమ్మ ఉండాలని కోరడం అందరిని కంటతడి పెట్టించింది. విజయ్ మామను కలువు. సారన్న చెప్పింది నేను చెప్పినట్టే.

Also Read: అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు:ఎంఎల్‌ఎ సైదిరెడ్డి

మామా, చందుకు రూ.2 లక్షలు ఇవ్వాలని మృతుడు పేర్కొన్నాడు. తన ఇల్లు అప్పు, పూర్తి ఇల్లు బాధ్యత, మిగితా వన్ని మా మమ అంజయ్యదే తుది నిర్ణయం అని,నేను ఎవరిని మోసం చేయలేదని ఎవరి వద్ద వృత్తిని అడ్డుపెట్టుకొని దోచుకోలేదని, నా చివరి కోరిక మండలంలోని జర్నలిస్టుందరికి ఇండ్లు కట్టివ్వాలి, పై నలుగురికి తక్షణమే శిక్ష పడాలని మృతుడు పొన్నం శ్రీకాంత్ కోరాడు. ఈ మేరకు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News