Wednesday, December 25, 2024

చైతన్యభరిత అనుభవశాలి

- Advertisement -
- Advertisement -

ప్రసిద్ధ పాత్రికేయుడు జి కృష్ణ జర్నలిస్టుగా తన అనుభవాలను రాసుకున్న తర్వాత అది పుస్తకంగా అచ్చువేస్తున్నప్పుడు ‘అవ్యక్త కోలాహలం’ అని ముందుమాట రాసుకుంటూ ‘జారచోరా భజన చేసితినా’ అని త్యాగరాజ కృతిని జ్ఞాపకం చేసుకుం టాడు. నా విలేఖరిత్వం జారచోరభజనా? నా విలేఖరిత్వం దేశానికి సేవా? అని ప్రశ్నించుకుంటూనే కోలాహలంగా నిలిచిన అనుభవం అంటాడు.. కృష్ణ శత జయంతి సంవత్సరం ఇది. ఆయన 1924 అక్టోబర్ 20వ తేదీన గుడ వెర్రు అగ్రహారంలో విజయదశమి రోజున జన్మించారు. ఇంకో వారం రోజులు అయితే ఆయన శత జయంతి సంవత్సరం పూర్తయిపోతుంది. ఇప్పటికైనా ఆయనను గుర్తు చేసుకోవాలని, కొత్త తరం జర్నలిస్టులకు, భావితరాల జర్నలిస్టులకు ఆయన గురించి ఎరుక చెప్పాలనే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసాలు. – ఎడిటర్

నేను బిహెచ్‌ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో లైబ్రేరియన్‌గా చేరిన తరువాత 1974లో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ‘ప్రత్యేక ప్రతినిధి’గా పని చేస్తున్న ‘ఉద్దండ పాత్రికేయుడు’ జి కృష్ణను తొలిసారి కలిశాను. అప్పట్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం లిబర్టీ క్రాస్ రోడ్ నుంచి హిమాయత్‌నగర్ దారిలో కొద్ది దూరంలో ఉండేది. క్రమేణా 1977లో హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన తరువాత ఆ కార్యాలయం లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులోకి మారింది. అయితే, నా దురదృష్టం కొద్దీ, నేను చివరి సారిగా ఫోన్‌లో ఆయనతో మాట్లాడినప్పుడు, ఇంటికి రావలసిందిగా ఆయన నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఖమ్మంలో ఉన్నందున ఆయనను కలుసుకోలేకపోయాను. నేను హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసరికి 2001 ఏప్రిల్ 6న ఆయన మరణించారన్న విషాదకర వార్త విన్నాను.
‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ’లో తరచు తన ప్రవేశం, నిష్క్రమణ’ గురించి కృష్ణ మా సుదీర్ఘ అనుబంధంలో ఎన్నడూ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అయినప్పటికీ, ఎప్పటికన్నా ఆయన మరింత హాస్యధోరణిలో ఉన్నప్పుడు ఒకింత బాహాటంగా మాట్లాడుతుండేవారు. ఉదాహరణకు, 1959లో న్యూస్ ఎడిటర్‌గా చేరిన తరువాత చిత్తూరు, మద్రాసు (చెన్నై)లో ఆంధ్రప్రభ రెసిడెంట్ ఎడిటర్‌గా పదోన్నతి పొందిన తరువాత, ఆఫీసుకు వెళ్లినప్పుడు తన కుర్చీలో వేరే ఎవరో (శ్రీరాములు) కూర్చుని. తన పక్కనే తన కోసం మరొక కుర్చీ వేయించడం చూసిన తరువాత 1964లో శాంతంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించడానికి బదులు రామ్‌నాథ్ గోయెంకా ఆయనను హైదరాబాద్‌లో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ చీఫ్ రిపోర్టర్‌గా నియమించారు.

తన విలక్షణ శైలిలో ఒక ప్రత్యేక వ్యాసం ఎందుకు రాస్తుంటారని కృష్ణను అడిగినప్పుడల్లా జర్నలిస్టు కావడానికి తన ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన లక్ష్మీనాథం, రామమూర్తి వంటి ఉపాధ్యాయులు అని ఆయన జవాబు ఇస్తుండేవారు. ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు చెప్పారో పాత్రికేయుడు గుర్తుంచుకోవడం అవసరమని ఆయన నొక్కి చెబుతుండేవారు. కృష్ణ ఒకసారి తన నిజాం కళాశాల లెక్చరర్ రామ నర్సు (బి పిఆర్ విఠల్ తండ్రి) గురించి ప్రశంసాత్మకంగా రాశారు. గుంటూరు హిందు కళాశాలలో చదు వుకుంటున్నప్పుడు జి కృష్ణ ‘క్విట్ ఇండియా ఉద్యమం’లో పాల్గొని, ‘సత్యాగ్రహ పాఠశాల’కు హాజరయ్యారు. ఆ రెండింటిలో పాల్గొన్నందుకు ఆయనను 1943లో రెండు సార్లు అరెస్టు చేసి, జైలు శిక్ష, జరిమానా విధించారు.

అయితే, 1968లో రామ్‌నాథ్ గోయెంకా కుమారుడు భగవాన్ దాస్ గోయెంకా తన తండ్రికి తెలియకుండా తన (కృష్ణ) ను విజయవాడకు బదలీ చేయడంతో బాధపడి రాజీనామా చేసి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుంచి బయటికొచ్చారు. ఆ తరువాత నాలుగున్నర సంవత్సరాలపాటు ఆయనను ప్రత్యేక ప్రతినిధిగా తిరిగి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రామ్‌నాథ్ గోయెంకా తీసుకు వచ్చేంత వరకు ఆయన అదే ఎక్స్‌ప్రెస్‌కు రాజకీయేతర అంశాలపై తిరిగి రాస్తూ విజయవాడలో ఉన్నారు. ఆయన 1982 అక్టోబర్ 19న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రిటైరయ్యారు.
అయితే, రామ్‌నాథ్ గోయెంకా నచ్చజెప్పడంతో, ఎమర్జన్సీ మధ్యలో జి కృష్ణను స్వయంగా విజయవాడ నివాసంలో కలిసిన తరువాత ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కొనసాగేందుకు అంగీకరించి, 1976 ఏప్రిల్ 27న ‘ప్రత్యేక ప్రతినిధి’ గా చేరేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. జి కృష్ణతో బాగా పరిచయం ఉన్న జలగం వెంగళరావు ఆ సమయంలో పూర్వపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జి కృష్ణ కుమారుడు, స్వయంగా సీనియర్ పాత్రికేయుడైన గండూరి రాజశుక తమ ఇంటికి గోయెంకా వచ్చిన రోజు జరిగినదంతా గుర్తు చేసుకున్నారు.
ఆస్తి వివాదంలో, జెబి మంగారాంతో వివాదాస్పద న్యాయ పోరాటంలో ఉన్న లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంగణంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గురించి, జి కృష్ణ విజ్ఞప్తిపై జలగం జోక్యంతో సామరస్యపూర్వకంగా పరిష్కారం కావడం గురించి జి కృష్ణ ఒకసారి మా మాటల సందర్భంలో వెల్లడించారు. తన చిత్తశుద్ధి, నిజాయితీ, తన కాలంలోని పలు రాజకీయ నేతలతో పాత్రికేయునిగా గల సుహృద్భావ సంబంధాలకు పేరొందిన జి కృష్ణ సున్నితంగా, నేర్పుగా జలగం వెంగళరావు పలుకుబడిని ఉపయోగించాలని కోరారు. జి కృష్ణ (గండూరి కల్యాణ వేణుగోపాల కృష్ణమూర్తి) 1924 అక్టోబర్ 24న విజయదశమి రోజు గొడవర్రు అగ్రహారంలో జన్మించారు. ఆయన 8 సంవత్సరాల వయస్సులో చదువు కోసం హైదరాబాద్ వచ్చి, తన మేనమామ ఇంటిలో బస చేశారు. ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య, మహబూబ్ కళాశాలలో కాలేజీ విద్య అభ్యసించి, గుంటూరు హిందు కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ఆయన హైదరాబాద్ నిజామ్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు.
తన విలక్షణ శైలిలో ఒక ప్రత్యేక వ్యాసం ఎందుకు రాస్తుంటారని కృష్ణను అడిగినప్పుడల్లా జర్నలిస్టు కావడానికి తన ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన లక్ష్మీనాథం, రామమూర్తి వంటి ఉపాధ్యాయులు అని ఆయన జవాబు ఇస్తుండేవారు. ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు చెప్పారో పాత్రికేయుడు గుర్తుంచుకోవడం అవసరమని ఆయన నొక్కి చెబుతుండేవారు. కృష్ణ ఒకసారి తన నిజాం కళాశాల లెక్చరర్ రామ నర్సు (బిపిఆర్ విఠల్ తండ్రి) గురించి ప్రశంసాత్మకంగా రాశారు. గుంటూరు హిందు కళాశాలలో చదువుకుంటున్నప్పుడు జి కృష్ణ ‘క్విట్ ఇండియా ఉద్యమం’లో పాల్గొని, ‘సత్యాగ్రహ పాఠశాల’కు హాజరయ్యారు. ఆ రెండింటిలో పాల్గొన్నందుకు ఆయనను 1943లో రెండు సార్లు అరెస్టు చేసి, జైలు శిక్ష, జరిమానా విధించారు.
కృష్ణ 1945లో ‘ఇంగ్లీష్ మీజాన్’లో విలేకరిగా చేరారు. మీజాన్‌లో మూడు నాలుగు మాసాలు పని చేసి, రాంభట్ల, సిఎస్ నాయుడు వంటివారి ప్రశంసలు చూరగొన్న తరువాత ఆయన మద్రాసు (చెన్నై)కి మారి ఖాసా సుబ్బారావు నుంచి సిఫార్సు లేఖతో 1946లో ‘ఫ్రీ ప్రెస్’లో విలేకరిగా చేరారు. కృష్ణ దృక్పథంలో ఒక పాత్రికేయునికి ప్రతి క్షణం అభ్యసన అనుభవమే. ఫ్రీ ప్రెస్ నుంచి కృష్ణ ‘ఆంధ్ర పత్రిక’కు మారి, మద్రాసు (చెన్నై), హైదరాబాద్, ఢిల్లీ, కర్నూలు, బొంబాయి (ముంబై), విజయవాడలలో పని చేశారు. ఆ తరువాత ఆయన చిత్తూరు, మద్రాసులలో రామ్‌నాథ్ గోయెంకా ‘ఆంధ్రప్రభ’లో రెసిడెంట్ ఎడిటర్‌గా చేరారు.
1982 అక్టోబర్ 19న ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయన గతంలో వలె తన అవిరామ పాత్రికేయ వృత్తిని అదే వేగంతో, అభిరుచితో ఫ్రీలాన్స్ రచయితగా, కాలమిస్ట్‌గా తన చివరి శ్వాస వరకు కొనసాగించారు. అదనంగా, జి కృష్ణ తన రిటైర్‌మెంట్ తరువాత ఉస్మానియా, తెలుగు విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం గెస్ట్ లెక్చరర్‌గా, తెలుగు విశ్వవిద్యాలయంలో (ఆస్ట్రాలజీ సంపుటి, కెవిఎల్‌ఆర్ సెంటర్) ఎడిటర్ కంపైలర్‌గా. ద్విభాష వార్త ఫీచర్ అయిన ‘నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’ ఎడిటర్, ప్రత్యేక ప్రతినిధిగా పని చేశారు. అయితే, ఆయన ఎప్పుడూ తనను ‘కలం కూలీ’గా, రిటైర్‌మెంట్ తరువాత ‘సాహితీ కూలీ’గా అభివర్ణించుకుంటుండేవారు. 2024 అక్టోబర్ 24న పాటించినట్లయితే, అది ‘విశ్వవిఖ్యాత పాత్రికేయుడు’ జి కృష్ణకు శతజయంతి అయి ఉండేది. ఆయన చెన్నై నుంచి తిరిగి వచ్చిన తరువాత అనారోగ్యంతో 2001 ఏప్రిల్ 6న కన్ను మూశారు. ఆయన చెన్నైలో తన కుమారుడు రాజశుక వద్ద బస చేశారు. ఆ సమయంలోనే, ఆయన మరణానికి ముందు ఆయన చివరి గ్రంథం, ముద్రణలో ఉన్న, ‘విలేఖరి లోకం’ 2000 సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదల కావలసి ఉన్నది. ‘ప్రజాతంత్ర’లో ప్రతి వారం ప్రచురించిన, తెలుగులో రాసిన ‘102 విశిష్ట వ్యాసాల’ సంకలనం ఆ గ్రంథం.
‘ప్రజాతంత్ర’ వార పత్రిక ప్రారంభించడానికి ముందు నేను, దేవులపల్లి అమర్, దేవులపల్లి అజయ్ దాని కోసం ఒక కాలం రాయవలసిందిగా కృష్ణకు విజ్ఞప్తి చేశాం. వ్యాసాలు ఆయన అంతకు ముందు రాసిన వాటికన్నా ‘విలక్షణంగా, అసాధారణంగా, భిన్నంగా’ ఉండాలని దేవులపల్లి సోదరులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అదే ‘విలేఖరి లోకం’కు నాంది. వాస్తవానికి, ఒక్క అంగుళం కూడా పక్కకు మళ్లకుండా ఆయన నిరాఘాటంగా వంద వారాలకు పైగా ‘విలేఖరి లోకం’ కాలమ్ రాశారు. సమకాలీన పాత్రికేయ ప్రస్థానాన్ని వివరిస్తూనే, తన కాలంలోని రాజకీయ, సాంఘిక, ఆర్థిక అంశాలను ప్రస్తావించారు. అవసరమైన చోట తన వ్యక్తిగత అనుభవాలను సందర్భానుసారమే, కానీ సముచితంగానూ ఆయన చేర్చారు. ‘విలేఖరి లోకం’ ఆయన చివరి కాలం.
‘అవ్యక్త సంక్షోభం, అవ్యక్త కోలాహలం’ శీర్షికన ఈ గ్రంథానికి ‘కృతజ్ఞతపూర్వక ముందు మాట’ లో జి కృష్ణ ‘నా జర్నలిజం జారచోర భజనా?’ లేక ‘ఇది దేశ సేవా?’ అని తనను తాను ప్రశ్నించుకున్నారు. అయినప్పటికీ, అది ‘కోలాహలంలో తారాడే అనుభవం’ అని ఆయన ముగించారు. ఆయన తన గ్రంథాన్ని మా అత్తమామలకు అంకితం చేశారు.
ఆయన ఇంకా ఇలా రాశారు: ‘నేను తిరువయ్యూరు వెళ్లినప్పుడు అక్కడ త్యాగరాజు ఇంకా గానం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, నాలో అంతర్గతంగా ఒక మృదువైన, మధురమైన అలజడిని వినగలను. నా రచనలు ‘దొంగలు, దోపిడీదొంగలకు భక్తి గీతాలా?’ లేక దేశ సేవా? కానీ అది అలజడి భరిత అనుభవం. ఆ అలజడిని కొంత పంచుకునేందుకు నా యువ మిత్రుడు, ప్రజాతంత్ర ఎడిటర్, దేవులపల్లి అమర్ నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను ఆయనకు కృతజ్ఞుడిని. నా వ్యాసాల్లో దేశ సేవకు ప్రాతిపదిక, మూలం నా మిత్రుడు ఐతరాజు రామ్ రావు ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహం. వల్లభి గ్రామంలో హరిజనులకు నష్టం కలిగినప్పుడు పెద్దాయన ఆచార్య భన్సాలీని తీసుకువచ్చి, పరిస్థితిని చూపించారు, ఆయన దానికి ముగింపు ఇచ్చారు’. ‘చిరివాడలో, పోలీసుల ఆగ్రహం తనపైకి మళ్లినప్పుడు, వేలూరు యజ్ఞ నారాయణ శాస్త్రి ఆ ఆగ్రహాన్ని చల్లార్చారు. పెద్దల హుందా మార్గం అది, అది మృదువైన. మధురమైన అలజడి. దినపత్రిక రచయితల్లో ఒక పండితునిగా నన్ను నేను పిలుచుకోగలనా? నాపై చూపిన సహృదయతకు మా సదాశివకు కృతజ్ఞుడిని. కృతజ్ఞత లేకపోతే నేను ఏమీ కాను,. హనుమంతరావు నాకు గొప్ప వ్యక్తి’.
కృష్ణ రాసిన ఈ ప్రకరణం కృతజ్ఞత భావాన్ని రమ్యంగా ప్రతిఫలిస్తోంది. పెద్దల ప్రభావాన్ని, అనుభవాన్ని జి కృష్ణ అంగీకరించడమే కాకుండా, ఒక రచయితగా, పాత్రికేయునిగా, ఒక వ్యక్తిగా తన సొంత పథాన్ని మలచుకోవడంలో ప్రతిబింబించింది. జి కృష్ణ పాత్రికేయ ప్రస్థానం చిత్తశుద్ధి వారసత్వం. ఆయన కేవలం పాత్రికేయుడు కారు, భారతీయ జర్నలిజ లోకంలో, ముఖ్యంగా తెలుగు జర్నలిజంలో చిత్తశుద్ధికి, సాహసానికి మార్గసూచి.

వనం జ్వాలా నరసింహారావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News