న్యూఢిల్లీ: జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, మొహమ్మద్ జుబైర్‌కు సోమవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్‌లో ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన ఐదు ఎఫ్‌ఐఆర్‌లపై తదుపరి ఎలాంటి చర్య తీసుకోరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ట్వీట్స్ చేశారంటూ జుబైర్‌పై ఉత్తరప్రదేశ్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టి ఈమేరకు ఊరట కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 20 కి వాయిదా వేసింది. వరుసగా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడంపై ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. జుబైర్‌కు బెయిలు మంజూరు చేస్తున్న సమయంలో మరో ఎఫ్‌ఐఆర్ జుమైర్‌పై దాఖలు కావడంపై ధర్మాసనం లోని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎఎస్ బొపన్న ఇదో విషవలయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జుబైర్ తరఫున న్యాయవాది వ్రిందా గ్రోవర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం బెయిలు మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్‌లో నమోదైన కేసుకు సంబంధించి మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు వివరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించింది. ఇదే సమయంలో జుబైర్‌పై మరో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.
Journalist Mohammed Zubair gets relief in Supreme Court