Thursday, January 23, 2025

20 నుంచి జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జేఏటీ) ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి కెఎస్‌జి జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ టి20 టోర్నీ జరగనుంది. 25వ తేదీ వరకు సాగనున్న ఈ టోర్నీలో మొత్తం పది మీడియా సంస్థలకు చెందిన పది జట్లు తలపడనున్నాయి. ఈ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఎల్‌బి స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, ట్రోఫీని ఆవిష్కరించారు.

అనంతరం కెఎస్‌జి సంస్థ చైర్మన్, ఇండి రేసింగ్ టీమ్ ఓనర్ కె.అభిషేక్ రెడ్డి, త్రుక్ష ఫుడ్స్ ఎండి సిహెచ్ భరత్ రెడ్డి, లైఫ్‌స్పాన్ ప్రతినిధి భరణి 10 జట్ల కెప్టెన్లకు క్యాప్స్ అందజేశారు. అనంతరం ఎంఎస్‌కె ప్రసాద్ మాట్లాడుతూ.. ‘క్రీడా జర్నలిస్ట్‌లతోనే ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని, ప్రొఫెషనల్ పద్ధతిలో జర్నలిస్టులు క్రికెట్ ఆడనుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏ క్రీడలోనైనా ప్రతిభా గల ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావాలంటే అది క్రీడా జర్నలిస్టులతోనే సాధ్యమని, వారి కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి గౌరవించాలి’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News