Tuesday, January 21, 2025

జర్నలిస్ట్ రాగి సహదేవ్‌కు గౌరవ డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి: యాదగిరిగుట్టకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాగి సహదేవ్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అవార్డుకు ఎంపికయ్యారు. చెన్నైలోని జీవ థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం సందర్భంగా అవార్డును రాగి సహదేవ్‌కు అందజేశారు. ఆదివారం అవార్డు పొందిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 1981 నుంచి జర్నలిస్ట్‌గా జీవితం ప్రారంభించిన తనకు అనేక పత్రికలతో పాటు సమాజాన్ని చైతన్యపరిచే కవితలు, వార్తలతో గుర్తింపు పొందినందుకుగానూ అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపవర్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ లతామూర్తి, అపిటికో లిమిటెడ్ బిజినెస్ ఆఫీసర్, రూపేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ఎండి డాక్టర్ కండ్లగుంటి బాబు తదితరులు పాల్గొన్నారు. రాగి సహదేవ్‌కు అవార్డు పట్ల యాదగిరిగుట్టలోని ఆశ్రమ పీఠాధిపతి బోధానందగిరి స్వామి, కవులు, జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News