Sunday, December 22, 2024

జర్నలిస్టులకు బీమా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు ప్రెస్ క్లబ్ లోని జర్నలిస్టులకు బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పోస్టల్ బీమా పత్రాలు అందజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత్కూరు ప్రదీప్ శర్మ ఆర్థిక సహకారంతో క్లబ్ సభ్యులకు చేయించిన పోస్టల్ బీమా పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు బీమా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత్కూరు ప్రదీప్ శర్మ, ప్రధానకార్యదర్శి బొడిగె శ్రీహరి, సభ్యులు పంగ నర్సింగరావు, కూరెళ్ల వెంకన్న, ఈదునూరి కృష్ణ, కూరెళ్ల విష్ణు, అవిశెట్టి యాదగిరి, మోత్కూరు రమేష్, గోపల్దాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News