Wednesday, January 22, 2025

యూపీలో దుండగుల కాల్పులకు విలేఖరి బలి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ షాగంజ్ ఏరియాలో 43 ఏళ్ల పత్రికా విలేఖరి అశుతోష్ శ్రీవాస్తవను సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. శబర్‌హాడ్ గ్రామానికి చెందిన అశుతోష్ సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇమ్రాన్‌గంజ్ మార్కెట్‌కు వెళ్తుండగా జాన్‌పూర్ షాగంజ్ రోడ్డులో ఈ దాడి జరిగిందని షాగంజ్ సర్కిల్ ఆఫీసర్ అజిత్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా అశుతోష్ నెల రోజుల క్రితం పోలీస్‌లను అభ్యర్థిస్తూ లేఖ రాశారని, కానీ పోలీస్ అధికారులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ హత్యకు నిరసనగా స్థానికులు రోడ్డును దిగ్బంధం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన తరువాత నిరసన విరమించడమైంది.

ఆ ప్రాంతంలో గోవధకు వ్యతిరేకంగా శ్రీవాస్తవ వార్తలు రాయడమే ఈ హత్యకు కారణంగా స్థానిక జర్నలిస్టులు ఆరోపించారు. స్మగ్లర్ల నుంచి అనేక సార్లు అశుతోష్‌కు బెదిరింపులు వచ్చాయని, దీనిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడని చెప్పారు. దుండగులను పట్టుకోడానికి పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఎస్‌పి అజయ్ పాల్ శర్మ చెప్పారు. జాన్‌పూర్ పత్రకార్ సంఘ్ ఈ హత్యను ఖండించింది. వీలైనంత త్వరలో హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అశుతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. పోలీస్‌ల నిర్లక్షం వల్లనే అశుతోష్ హత్య జరిగిందని బాధ్యులైన పోలీస్‌లపై చట్టపరమైన చర్య తీసుకోవాలని జర్నలిస్ట్‌ల సంఘం డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News