Saturday, November 23, 2024

జర్నలిస్టుల బస్ పాసుల గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

Journalists bus pass date extension

మనతెలంగాణ/ హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు జర్నలిస్టుల బస్ పాసుల కాలపరిమితి గడువు పొడిగిస్తున్నట్లు ఆర్టీసీ ప్రజాసంబంధాల సాంకేతిక అధికారి రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 30తో ముగియనున్న జర్నలిస్టుల బస్ పాసుల గడువును మరో మూడు నెలల పొడిగించినట్లు పేర్కొన్నారు. గడువు పెంచిన కాలానికి బస్‌పాసులను ఆర్టీసి కేంద్రాల్లో జారీ చేస్తారని వెల్లడించారు. అక్రిడిటేషన్ గడువును పొందిన జర్నలిస్టులు జిహెచ్‌ఎంసి పరిధిలోని బస్ పాస్ కేంద్రాల్లో పెంచిన గడువుకు వర్తించేలా బస్ పాసులు పొందాలని సూచించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వరకు పెంచిన గడువు వర్తిస్తుందని తెలిపారు. ఆర్టీసీ బస్‌పాసుల జారీలో ఏదైన ఇబ్బందులు కలిగితే ఫోన్ నంబరు 99592 25229 లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News