- Advertisement -
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్‌పై సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఏజెన్సీలు ఈ స్పైవేర్ ద్వారా దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై నిఘా పెట్టినట్టు ఆరోపణలొచ్చాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతిని అణచివేసే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఏజెన్సీలు ఈ స్పైవేర్ ద్వారా ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేసినట్టుగా భావించాల్సి వస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఏజెన్సీలు ఈ స్పైవేర్‌కు లైసెన్స్ పొందితే, దానిని రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మరికొన్ని రోజుల్లో విచారించనున్నట్టు భావిస్తున్నారు.
- Advertisement -