Tuesday, December 24, 2024

కలకాలం ఇదే సాగనీ…!

- Advertisement -
- Advertisement -

ఈ జీవనవనంలో
ఎన్నెన్నో దారుల ప్రవేశం….
తొలి అడుగు నుండి తుది అడుగు
తుది అడుగు నుండి తొలి అడుగు వరకూ ఊగుతున్న ఊయలై – కదులుతున్న మేఘాలై మునుముందుగా గమ్యం చేరుకున్న వారికే ప్రశంసల వర్షం – లేకుంటే ప్రశ్నల ప్రళయమే…!

ఈ నవజీవనయానంలో
గమ్యమెవుడూ – శ్రద్ధశ్రమకి కొద్దిదూరమే
నిర్లక్ష్యం సత్తువ అది బహుదూరాభారమే… నత్తనడకలూ చిరుతపరుగుల చిరకాల పరిచితమే – పులి కన్నా జింక వేగం మిన్న అది భయంతో పులికి పుష్టికరఆహారమయ్యేది అనుభవైకవేద్యమే…
తనకే తెలీక.. తనవద్ద దాగిన సుందర సుగంధం అరణ్యమంతా గాలించి – నేలవిడిచి సాము చేసిన – కస్తూరి మృగం చివరికి ఒంటరిపోరాటసాధన – తనకి పరిపూర్ణత్వనందేశమే…!

ఈ దివ్యజీవన మజిలీ మదిలో లక్ష్యంగమ్యానికి మధ్య ఎన్నో వున్నములూ – పునర్జన్మలూ సహజాతినహజం పయనం ఓ పరీక్ష మలిపయనం – బోధించే పరివర్తన పాఠం నీవు నీలోనికే ఏకమైన వివేకం అంతరంగాల్ని జతచేస్తే సుగుణాత్మకమే…!!

ఈ జ్ఞానజీవనదర్శనంలో సక్రమనియమాల దిశానిర్దేశంతో ప్రతిబింబించడంలో లయనిలయమై కలకాలం నడయాడడంలో సూర్యోదయ సూర్యాస్తమయాల చంద్రోదయ చంద్రాస్తమయాలు ఆలోకనం…..!!

ఆరోహణ అవరోహణ నిష్క్రమణం
మనకి ఆదర్శాలదర్శనమే – ఆచరణాత్మకమే…!!
ఈ సహజీవన బృందావనంలో
ప్రత్యక్షంగానో – పరోక్షంగానో
అద్భుతసదృశ – చిత్రవిచిత్రాల వీక్షణం…
నయనాలున్నా లేకున్నా
ఎన్నో ప్రణయప్రమోదాలూ
ఎన్నెన్నో ప్రణవ ప్రమాదాలూ
మరెన్నో వినోద విహారవిరహాలూ
విడివిడిగా మొత్తంగా ఏకంగా అనేకంగా
ఓ రంగుల కలల సంగమం స్పృహాసృజనాత్మకమే…!!!
ఈ జనజీవనస్రవంతిలో
నీరూ – కన్నీరూ – పన్నీరూ పల్లంవైపే తమ పరుగనీ కాళ్లు తడవకుండా కడలిని దాటవచ్చనీ
కళ్లు తడవకుండా మన జీవనం కొనసాగించలేమనీ – వేదనల్లో – వేదాలవేదికనీ వెతుక్కొమ్మనీ
బాధ్యతలే బాంధవ్యాలనీ
అవి నవ్యనిత్యదివ్యచైతన్యానికీ నిర్విరామక్రియాత్మకమనీ…!!!

ఈ సజీవవయనంలో
మనందరి అడుగులతోరణాలు – పల్లవి చరణాలై
అడుగులజాడలు మరెందరికో నీడలై
గమ్యాన్ని అక్కున చేర్చుకున్న శుభవేళ
శబ్దనిశ్శబ్దాల సమైక్యసమ్మేళనం
పొరలు పొరలుగా మెట్లుగా
అలలు అలలుగా – కలలుకళలుగా
అంతర్ముఖం లోనికో…?
బహుర్ముఖం లోనికో..? ప్రతిధ్వనించిన మనోప్రస్థానం మరో ప్రవాహమే… మానవత్వం పారిజాతంలా పరిమళిస్తూనే మళ్లీ మళ్లీ.. మొదలవుతూనే అనంతనిరంతరంగా.ఆరంభమే…!!!

కందకట్ల జనార్ధన్
7893631456

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News