Tuesday, November 5, 2024

హుజూర్‌నగర్‌లో బిజెపి సభ అట్టర్ ఫ్లాప్..

- Advertisement -
- Advertisement -

హుజూర్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ హుజూర్‌నగర్ అభ్యర్ధి చల్లా శ్రీలత రెడ్డి గెలుపును కోరుతూ శనివారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి శ్రీసీతారామచంద్రస్వామి గట్టుకు వెళ్ళే దారిలో ఉన్న ఖాళీ స్ధలంలో సభను నిర్వహించారు. అన్ని సభల్లా భారీ జన సమీకరణతో మొత్తం స్థ్ధలంలో ఏర్పాటు చేయకుండా అతి తక్కువ స్థ్ధలంలోనే విఐపి సిట్టింగ్, మీడియా గ్యాలరీ, స్టేజీలను సమకూర్చారు. ఆ కొద్ది స్థలంలోనే జనాన్ని తరలించేందుకు పార్టీ శ్రేణులు నానా తంటాలు పడ్డారు.

దీంతో సభలో జనం లేక కుర్చీలు వెలవెలబోయాయి. ఉదయం 10:30 నిమిషాలకు నడ్డా వస్తారని ప్రచారం చేసినా బిజెపి నేతలు సమయపాలన పాటించలేకపోయారు. దీంతో జెపినడ్డా సభలో కాలు మోపుతుండగానే సభకు వచ్చిన ఆ కొద్ది మంది జనం కూడా కుర్చీలల్లో నుండి లేచి వెళ్ళిపోయారు. అందువల్ల జేపీనడ్డా ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని వినిపించక తప్పలేదు. సభలో ఖాళీ కుర్చీలను గమనించిన బిజెపి ఆధినాయకత్వానికి హుజూర్‌నగర్‌లో ఆ పార్టీ పరిస్థ్ధితి అర్థమయింది. దీన్ని బట్టి చూస్తే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థ్ధికి నాల్గవ స్ధానం, లేకపోతే ఐదవ స్ధానమైనా లభిస్తుందా అని హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News