- Advertisement -
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాను రాజ్యసభలో సభా నాయకునిగా నియమించినట్లు అధికార వర్గాలు సోమవారం ప్రకటించాయి. పీయూష్ గోయల్ స్థానంలో నడ్డా నియామకం జరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన గోయల్ సోమవారం దిగువ సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. నడ్డా కాకుండా కేంద్ర మంత్రి మండలిలోని మరి 11 మంది ఎగువ సభలో సభ్యులుగా ఉన్నారు,
- Advertisement -