Sunday, December 22, 2024

ఐదు బ్యాగ్‌లతో డబ్బు మోసుకొచ్చిన నడ్డా : తేజస్వియాదవ్

- Advertisement -
- Advertisement -

బీహార్ ఓటర్లకు బీజేపీ డబ్బు పంపిణీ ప్రారంభించింది. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బీహార్‌కు వచ్చారు. ఐదు బ్యాగ్‌లతో డబ్బు మోసుకొచ్చారు. అయినా సరే ఆర్‌జేడీ, దాని మిత్ర పక్షాలు తప్పనిసరిగా విజయం సాధిస్తాయి. బీహార్ రెండో దశ ఎన్నికల సందర్భంగా నడ్డా బీహార్‌కు అనేక డబ్బుల బ్యాగ్‌లతో వస్తున్నారని నాకు సమాచారం అందింది. ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇది తనిఖీ చేయాల్సి ఉంది. డబ్బు పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు వాస్తవం. నేను అబద్ధం చెప్పడం లేదు. దర్యాప్తు సంస్థలు నడ్డాకు బహిరంగంగానే సహాయ పడుతున్నాయి. నడ్డా ఢిల్లీ నుంచి వస్తూనే డబ్బుల సంచులతో బీహార్ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News