Wednesday, January 22, 2025

బిజెపి మేనిఫెస్టోకు సన్నాహాలు.. ప్రజల సూచనలకు పార్టీ పిలుపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రజలు తమ సూచనలు పంపాలని పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ సాగించిన కృషిని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ఆయన కలను ప్రధానంగా ప్రస్తావిస్తూ పార్టీ ప్రచార వీడియో వ్యాన్‌లను నడ్డా న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కోసం దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని నడ్డా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నడ్డా ప్రసంగిస్తూ.. ‘భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ ‘అమృత్ కాల్’లో సాగించిన కృషిని, దేశ ప్రగతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న యత్నాలను ప్రజలకు వివరించాలని బిజెపి నిశ్చయించింది’ అని తెలియజేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ ‘సంకల్ప్ పత్ర (తీర్మానం) రూపకల్పన పురోగతిలో ఉందని నడ్డా తెలియజేస్తూ, దీనికి తమ సూచనలు అందజేయవలసిందిగా ప్రజలను ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News