Wednesday, January 22, 2025

సమాజానికి అన్యాయం చేసిన వారే ఇప్పుడు న్యాయయాత్రకు యోచన

- Advertisement -
- Advertisement -

లక్నో : సమాజానికి ఎవరైతే అన్యాయం చేశారో వారే ఇప్పుడు న్యాయయాత్రకు యోచిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఇక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విపక్ష కూటమి ఇండియా బ్లాక్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఇండియా కూటమి దేశాన్ని కిందకు దిగజారుస్తోందని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం కోసం “వికసిత్ భారత్ సంకల్ప యాత్ర” నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సంకల్పయాత్ర సందర్భంగా మహిళలతో హాఫ్ మారథాన్‌ను నడ్డా జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News